Oppo Reno 15 Series : ఒప్పో రెనో 15 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Oppo Reno 15 Series : ఒప్పో నుంచి సరికొత్త ఒప్పో రెనో 15 సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్ టైమ్‌లైన్ ముందుగానే లీక్ అయింది. భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందంటే?

Oppo Reno 15 Series : ఒప్పో రెనో 15 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Oppo Reno 15 Series

Updated On : November 4, 2025 / 6:17 PM IST

Oppo Reno 15 Series : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ రెనో 15 లైనప్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కంపెనీ దీనిపై ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. రాబోయే లైనప్‌లో 3 మోడళ్లలో వెనిల్లా ఒప్పో రెనో 15, రెనో 15 ప్రో, ఒప్పో రెనో 15 మినీ ఉంటాయి.

అదనంగా, ఒప్పో రెనో ఫోన్‌ల కీలక స్పెసిఫికేషన్లు (Oppo Reno 15 Series) కూడా లీక్ అయ్యాయి. ఈ ఒప్పో ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌లు, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉన్నాయని అంటున్నారు. నివేదిక ప్రకారం.. ఈ సిరీస్ రాబోయే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఒప్పో రెనో 15 సిరీస్ గురించి మరిన్ని పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఒప్పో రెనో 15 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్ :
ఒప్పో రెనో 15 లైనప్ డిసెంబర్ 2025 నాటికి భారత మార్కెట్లో 3 వేరియంట్‌లతో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఒప్పో రెనో 15 మినీ, రెనో 15, ఒప్పో రెనో 15 ప్రో ఉన్నాయి. ముందస్తు రిపోర్టుల ప్రకారం.. ఒప్పో మొదట్లో ఒప్పో రెనో 15, ఒప్పో రెనో 15 ప్రో, ఒప్పో రెనో 15 ప్రో మాక్స్‌గా లాంచ్ చేయనుంది. కానీ, మినీ మోడల్‌లో మరింత కాంపాక్ట్ వేరియంట్‌ కోసం లైనప్ పేరు మార్చవచ్చు.

Read Also : Google Pixel 9a : ఇది కదా ఆఫర్ అంటే.. గూగుల్ పిక్సెల్ 9a అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే? డోంట్ మిస్!

ఒప్పో రెనో 15 సిరీస్ స్పెసిఫికేషన్లు :
ఒప్పో రెనో 15 ప్రో 6.78-అంగుళాల 1.5K ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అయితే, ఒప్పో రెనో 15, ఒప్పో రెనో 15 మినీ వరుసగా 6.59-అంగుళాలు, 6.32-అంగుళాల ప్యానెల్‌ కలిగి ఉండవచ్చు. ఈ ఒప్పో రెనో ఫోన్‌లు మెటల్ ఫ్రేమ్‌లు, ఆకట్టుకునే IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో రావచ్చు.

గత జనరేషన్ కన్నా ఎక్కువ మన్నికను అందిస్తుంది. హుడ్ కింద ఒప్పో రెనో 15 సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 SoC ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. అయితే, కొన్ని రిపోర్టులను పరిశీలిస్తే.. ఒప్పో ప్రో వేరియంట్ ఏఐ, గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం డైమెన్సిటీ 9400 కలిగి ఉండవచ్చు. టాప్-ఎండ్ మోడల్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 6,500mAh బ్యాటరీని కలిగి ఉండొచ్చు.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఒప్పో రెనో 15 ప్రో, ఒప్పో రెనో 15 మినీ 200MP శాంసంగ్ (ISOCELL HP5) ప్రైమరీ సెన్సార్‌ కలిగి ఉన్నాయని అంచనా. 50MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్ లెన్స్‌లతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ధర విషయానికి వస్తే.. రూ. 39,990 ఉంటుందని అంచనా.