Divvala Madhuri: వాడసలు మనిషే కాదు.. అందులో వల్గారిటీ ఏముంది.. భరణి ట్రోల్స్ పై మాధురి షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఈవారం దివ్వెల మాధురి ఎలిమినేట్ అయినా విషయం తెలిసిందే. ఇంట్లో ఉన్నన్ని రోజులో రోజు(Divvala Madhuri) ఎదో ఒక గొడవకు కారణం అవుతూవచ్చారు మాధురి.
                            Divvela Madhuri makes shocking comments on trolling
Divvala Madhuri: బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఈవారం దివ్వెల మాధురి ఎలిమినేట్ అయినా విషయం తెలిసిందే. ఇంట్లో ఉన్నన్ని రోజులో రోజు ఎదో ఒక గొడవకు కారణం అవుతూవచ్చారు మాధురి. దీంతో ఆమెకు బయట చాలా నెగటివ్ క్రియేట్ అయ్యింది. హౌస్ లో అడుగుపెట్టగానే శ్రీజతో (Divvala Madhuri)గొడవకు దిగిన మాధురి ఆ తరువాత కళ్యాణ్, దివ్య, తనూజ, భరణి ఇలా చాలా మందితో గొడవలు పెడుతూనే ఆట ఆడారు. దీంతో, ఆడియన్స్ ఆమెను ఇంట్లో భరించలేకపోయారు. వోటింగ్ తక్కువగా పడటంతో ఈవారం బయటకు వచ్చేసింది.
Rajasaab: వాయిదా లేదు ఎం లేదు.. అనుకున్న టైంకి వస్తున్నాం.. ప్రెస్ నోట్ విడుదల..
బయటకు వచ్చాక ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చారు. అయితే, మాధురి ఇంట్లో ఉన్నప్పుడు భరణితో డాన్స్ చేయడం గురించి చాలా ట్రోలింగ్ జరిగింది. దానిపై కూడా క్లారిటీ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు మాధురి.. నాకు నటించడం చేతకాదు. నేను ఏంటో ఇంట్లో కూడా అలానే ఉన్నాను. నేను వెల్లెలనుకొని బిగ్ బాస్ కి వెళ్ళాను. నేను రావాలనుకున్నాను కాబట్టి బయటకు వచ్చేశాను. నను ఎవరు బయటకు పంపలేదు. నేను బయట కూడా ఇలాగే ఉంటాను. లోపల కూడా అలాగే ఉన్నాను.
నేను భరణి గారితో చేసిన డాన్స్ గురించి చాలా ట్రోల్స్ చేశారు. అందులో తప్పేముందో నాకు అర్థంకాలేదు. నిజానికి భరణితో డాన్స్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ, నాగార్జున గారు అడిగారుకాబట్టి చేశాను. అక్కడు కూడా నా చేతివేలు కూడా భరణికి టచ్ అవలేదు. అందులో ఎలాంటి వల్గారిటీ లేదు. దానికి కూడా ట్రోలింగ్ చేశారంటే వాడు మనిషి కాదు. పశువుతో సమానం” అంటూ మండిపడింది. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
