Rajasaab: వాయిదా లేదు ఎం లేదు.. అనుకున్న టైంకి వస్తున్నాం.. ప్రెస్ నోట్ విడుదల..

గత వారం రోజుల నుంచి ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా వాయిదా పడనుంది(Rajasaab) అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Rajasaab: వాయిదా లేదు ఎం లేదు.. అనుకున్న టైంకి వస్తున్నాం.. ప్రెస్ నోట్ విడుదల..

makers officially released a press note on the release of Rajasaab movie

Updated On : November 4, 2025 / 3:43 PM IST

Rajasaab: గత వారం రోజుల నుంచి ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా వాయిదా పడనుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సినిమాలో విజివాల్ ఎఫెక్ట్ షాట్స్ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయని, ఆ కారణంగానే రాజసాబ్ సినిమా సంక్రాంతి(Rajasaab) సీజన్ నుంచి తప్పుకోనుంది అనే న్యూస్ వచ్చాయి. కానీ, తాజాగా ఈ వార్తలపై అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేశారు మేకర్స్. రాజాసాబ్ వాయిదా పడటం లేదని, అనుకున్న సమయానికి వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.

Don Lee: కొత్త ప్రయాణం మొదలయ్యింది.. స్పిరిట్ లో డాన్ లీ.. పోస్ట్ పెట్టి కన్ఫర్మ్ చేసిన నటుడు..

“ప్రస్తుతం రాజా సాబ్‌ సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ అండ్ వీఎఫ్‌ఎక్స్‌ పనులు జరుగుతున్నాయి. 2026 జనవరి 9న ఒకేసారి అన్ని భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఐమాక్స్ వెర్షన్‌తో సహా.. అన్ని ఫార్మేట్‌లలో ఒకేసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. డిసెంబర్‌ చివరి వారంలో అమెరికాలో భారీగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. డిసెంబర్‌ 25లోపే ఫస్ట్‌ కాపీ సిద్ధం అవుతుంది. కాబట్టి, రాజాసాబ్ విడుదలలో ఎలాంటి మార్పులు లేవు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేయడానికి ‘రాజా సాబ్‌’ (Prabhas) సిద్ధమవుతున్నాడు” అంటూ రాసుకొచ్చారు టీం. దీంతో రాజాసాబ్ విడుదలపై వస్తున్న వాయిదా వార్తలకు చెక్ పడింది.

ఇక ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను కామెడి చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే మొదటి పాట కూడా విడుదల కానుంది. మరి చాలా కాలం తరువాత వింటేజ్ ప్రభాస్ లుక్స్ తో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.