Don Lee: కొత్త ప్రయాణం మొదలయ్యింది.. స్పిరిట్ లో డాన్ లీ.. పోస్ట్ పెట్టి కన్ఫర్మ్ చేసిన నటుడు..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీస్ లలో స్పిరిట్ ఒకటి. డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Don Lee)తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ అంటే ఎమోషనల్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది.
                            Korean actor Don Lee to playing key role in prabhas spirit movie
Don Lee: .పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీస్ లలో స్పిరిట్ ఒకటి. డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ అంటే ఎమోషనల్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు రెండేళ్ల క్రితమే ఈ సినిమా (Don Lee)గురించి అధికారిక ప్రకటన వచ్చింది. కానీ, ప్రభాస్ అంతకుముందే ఒప్పుకున్న సినిమాల కారణంగా షూటింగ్ మొదలవలేడు. ఎట్టకేలకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయినట్టు తెలుస్తోంది. చాలా సింపుల్ గా ఈ సినిమా అఫీషియల్ పూజ కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారు మేకర్స్.
Peddi: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్.. హైప్ ఎక్కిస్తున్న రామ్ చరణ్ పోస్ట్.. గాయ్స్ అంటూ..
కేవలం పాన్ ఇండియా రేంజ్ లో కాదు ఇంటర్నేషనల్ లెవల్లో ఈ సినిమాను విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. దానికి తగ్గట్టుగానే హాలీవుడ్ రేంజ్ లో యాక్టర్స్ ను దించుతున్నాడు. కొంతకాలంగా ఈ సినిమాలో ప్రముఖ కొరియన్ నటుడు డాన్ లీ నటిస్తున్నాడు అనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇదీ విషయాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దగ్గర ప్రస్తావించగా చూద్దాం అని చెప్పి సింపుల్ గా తప్పించుకున్నాడు. తాజాగా ఈ క్రేజీ న్యూస్ పై అధికారిక ప్రకటన వచ్చింది. స్వయంగా కొరియన్ నటుడు డాన్ లీ తన సోషల్ మీడియాలో స్పిరిట్ సినిమా గురించి పోస్ట్ పెట్టాడు.
కొత్త ప్రయాణం ఈ రోజు నుంచి మొదలు అంటూ యాష్ ట్యాగ్ స్పిరిట్ ను యాడ్ చేశాడు ఈ నటుడు. దీంతో, స్పిరిట్ సినిమాలో డాన్ లీ నటిస్తున్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. దీంతో, ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాములు నటులతోనే ఒక రేంజ్ లో సినిమాలను సెట్ చేస్తాడు సందీప్. అలాంటిది, డాన్ లీ లాంటి నటుడు దొరికితే అది అరాచకానికి ఆరంభంలా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి షూటింగ్ మొదలుకావడంతోనే ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తరువాత ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
New Journey Started today 😇#Spirit pic.twitter.com/4BE2NmeooY
— Don Lee (@MaaDongSeok) November 4, 2025
