Dhurandhar 2 : ధురంధర్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది భయ్యా.. ఓ అద్భుతం, ఎప్పటికి మరిచిపోలేరంటా
సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీల్లో దురంధర్ 2 (Dhurandhar 2) ఒకటి.
Dhurandhar 2 First Review Yami Gautam calls husband Aditya Dhar film beyond extraordinary
- మార్చి 19 ప్రేక్షకుల ముందుకు రానున్న ధురంధర్ 2
- ధురంధర్ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న మూవీ
- ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసినట్లు చెప్పిన దర్శకుడి భార్య
Dhurandhar 2 : సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీల్లో దురంధర్ 2 ఒకటి. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధించిన ధురంధర్ చిత్రానికి సీక్వెల్గా వస్తుండడమే అందుకు కారణం.
సంజయ్ దత్, ఆర్.మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం హిందీలో మాత్రమే విడుదల కాగా రెండో భాగం మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sneha Reddy : అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీ.. అల్లు అర్జున్ భార్య స్నేహ మెరుపులు..
కాగా.. తాజాగా దర్శకుడి భార్య యామీ గౌతమ్ ఈ చిత్రాన్ని చూసినట్లు తెలిపింది. భారత్ సమ్మిట్ 2026లో పాల్గొన్న యామీ ఈ చిత్రం గురించి మాట్లాడారు. తన భర్త గొప్ప సినిమాలను తీస్తున్నారని చెప్పుకొచ్చింది. వృత్తిని ఎంతో ప్రేమిస్తారని తెలిపింది. ఇక తాను ధురంధర్ 2 చిత్రాన్ని చూసినట్లు వెల్లడించింది. ఈ చిత్రం ఎంతో బాగుందని అంది. ప్రతి భారతీయుడు గర్వపడే చిత్రం అవుతుందని చెప్పింది. ఈ విషయాన్ని తాను ఖచ్చితంగా చెప్పగలనని అంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
