Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మైండ్ బ్లోయింగ్ డీల్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh).
Pawan Kalyan Ustaad Bhagat Singh digital rights record deal
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుంటోంది. ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
ఇదిలా ఉంటే.. ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఏకంగా 80 కోట్ల వరకు అమ్ముడైనట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Dhurandhar 2 : ధురంధర్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది భయ్యా.. ఓ అద్భుతం, ఎప్పటికి మరిచిపోలేరంటా
ఇంత భారీ రేంజ్లో పవన్ సినిమాకు ఓటీటీ డీల్ కుదిరిందంటే బాక్సాఫీస్ దగ్గర ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందోనని ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రూ.80 కోట్లకు అమ్ముడు పోయాయో లేక జస్ట్ రూమార్సేనా అనేది మేకర్సే క్లారిటీ ఇవ్వాలి.
