Prabhas: ఆశపెట్టి ఆపేస్తున్నారు.. ఆ ప్రాజెక్టు ఇక లేనట్టే.. పాపం ప్రభాస్ ఫ్యాన్స్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి, ఆయన చేయబోతున్న సినిమాల గురించి ఎంత(Prabhas) చెప్పినా తక్కువే. ఎందుకంటే, ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న ఏ స్టార్ హీరోకి కూడా ఆ రేంజ్ లైనప్ లేదు.
Prabhas-Prashanth Varma upcoming movie Brahmarakshasa has been cancelled.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి, ఆయన చేయబోతున్న సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే, ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న ఏ స్టార్ హీరోకి కూడా ఆ రేంజ్ లైనప్ లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు భారీ సినిమాలను ఒకే చేశాడు ప్రభాస్(Prabhas). వాటిలో రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సాలార్ 2, కల్కి 2 లాంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కంప్లీట్ అవడానికి కనీసం మూడేళ్ళ సమయం పెట్టె అవకాశం ఉంది. దీంతో, ప్రభాస్ ఒకే చేసిన ఈ లైనప్ చూసి ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే, ఈ ఐదు సినిమాల మధ్యలో చేయడానికి మరో సినిమా చేయడానికి మరో క్రేజీ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్.
Deepthi Sunaina: క్రేజీ లుక్స్ తో కవ్విస్తున్న దీప్తి సునైనా.. ఫోటోలు
అదే “బ్రహ్మరాక్షస”. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాల్సి ఉంది. ఆ మధ్య ఈ ప్రాజెక్టు గురించి చాలా రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ, మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ మధ్య దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. దాంతో, వీళ్ళ కాంబోలో ఇప్పటికే ఒకే అయిన సినిమాలు క్యాన్సిల్ కానున్నాయి. వాటిలో, జై హనుమాన్, మహాకాళి సినిమాలు ఇప్పటికే పట్టాలెక్కేయగా.. అధీరా, బ్రహ్మరాక్షస సినిమాలు మొదలుకానున్నాయి.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ రెండు సినిమాలు ఓకే అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నిజానికి, బ్రహ్మరాక్షస సినిమాపై ఆడియన్స్ లో ఒక రేంజ్ లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడితో ప్రభాస్ సినిమా చేస్తే, అది కూడా మన పురాణాల ఆధారంగా చేస్తే రిజల్ట్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ, తాజాగా జరుగుతున్న పరిణామాల ప్రకారం ఈ ప్రాజెక్టు ఒకే అవడం కష్టం అనే చెప్పాలి. అలా భారీ హైప్ క్రియేట్ చేసిన బ్రహ్మరాక్షస సినిమా మొదలకుండానే క్యాన్సిల్ అవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
