Matthew Breetzke : చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే.. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు..
దక్షిణాఫ్రికా యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే (Matthew Breetzke) అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అరంగ్రేటం నుంచి వరుసగా..

Matthew Breetzke Scripts History Becomes First Batter In The World in ODI history
Matthew Breetzke : దక్షిణాఫ్రికా యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే(Matthew Breetzke) అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అరంగ్రేటం నుంచి వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లోనూ యాభైకి పైగా స్కోర్లను సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గురువారం మెక్కేలో ఆస్ట్రేలియాతో రెండో వన్డే మ్యాచ్‌లో 88 పరుగులు చేయడం ద్వారా అతడు ఈ ఘనత అందుకున్నాడు.
ఇక ఓవరాల్‌గా అరంగ్రేటం నుంచి వరుసగా నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 50 ఫ్లస్ స్కోర్లు చేసిన టీమ్ఇండియా ఆటగాడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. 1987లో ఆస్ట్రేలియా పై వన్డేల్లో అరంగ్రేటం చేసిన సిద్ధూ.. తన నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 73(ఆస్ట్రేలియాపై), 75 (న్యూజిలాండ్‌పై), 51(ఆస్ట్రేలియా), జింబాబ్వే (55) హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే.. సిద్ధూ కెరీర్‌లో మూడో వన్డేలో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
Sanju Samson : ఆసియాకప్ 2025కి ముందు సంజూ శాంసన్ కీలక నిర్ణయం.. ఓపెనర్ కాదని చెప్పేశారా?
ఇక మాథ్యూ బ్రీట్జ్కే విషయానికి వస్తే.. అతడు 2025లో లాహోర్‌లో న్యూజిలాండ్ తో మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్‌లో 150 పరుగులు సాధించి.. అరంగ్రేట వన్డే మ్యాచ్‌లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఆ తరువాత పాకిస్థాన్ పై 83 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆసీస్‌తో సిరీస్‌లో తొలి వన్డేలో 57 పరుగులు చేయగా, రెండో వన్డేలో 88 పరుగులు సాధించాడు.
ఇక దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే విషయానికి వస్తే..తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బ్యాటర్లలో మాథ్యూ బ్రీట్జ్కే (88; 78 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (74; 87 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు.
Rohit Sharma : ఆస్ట్రేలియా టూర్‌కు ముందు రోహిత్ శర్మ కీలక నిర్ణయం..!
మార్‌క్రమ్ డకౌట్ కాగా.. డెవాల్డ్ బ్రెవిస్(1), ర్యాన్ రికెల్టన్ (8)లు ఘోరంగా విఫలం అయ్యారు. టోనీ డి జోర్జీ (38), వియాన్ ముల్డర్ (26) లు ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీశాడు. జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, లబుషేన్‌లు తలా రెండు వికెట్లు తీశారు. జోష్ హేజిల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.