Rohit Sharma : ఆస్ట్రేలియా టూర్‌కు ముందు రోహిత్ శర్మ కీలక నిర్ణయం..!
అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.

Rohit Sharma wants to play India A vs Australia A ODIs report
Rohit Sharma : అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే తన లక్ష్యం అని పలు సందర్భాల్లో చెప్పాడు.
అయితే.. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ తరువాత హిట్‌మ్యాన్ వన్డేలకు సైతం వీడ్కోలు పలుకుతాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
మరోవైపు వన్డే ప్రపంచకప్ 2027ను దృష్టిలో పెట్టుకుని రోహిత్, కోహ్లి స్దానాల్లో యువ ఆటగాళ్లను సిద్దం చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పర్యటన కంటే ముందు స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న అనధికారిక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.
Ajinkya Rahane : అజింక్యా రహానే కీలక నిర్ణయం.. ఇక చాలు.. దిగిపోతున్నా..
కాన్ఫూర్ వేదికగా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 5 వరకు ఆస్ట్రేలియా-ఏ, భారత్-ఏ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల అనధికార వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో ఆడాలని రోహిత్ శర్మ నిర్ణయం తీసుకున్నాడని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని బీసీసీఐకి తెలియజేశాడని రెవ్‌స్పోర్ట్జ్ తెలిపింది.
ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19 నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్ సన్నద్ధం కోసం హిట్‌మ్యాన్ అనధికార వన్డే సిరీస్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్‌కు జాక్ పాట్..! టీ20 జట్టులో చోటు దక్కకపోయినా..
చివరిసారిగా రోహిత్ శర్మ టీమ్ఇండియా తరుపున ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నాడు. అతడి నాయకత్వంలో టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 38 ఏళ్లు. వన్డే ప్రపంచకప్ నాటికి అతడి 40 ఏళ్లు వస్తాయి. ఈ క్రమంలో అతడి నుంచి వన్డే పగ్గాలు తీసుకుని శ్రేయస్ కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.