Ajinkya Rahane : అజింక్యా ర‌హానే కీల‌క నిర్ణ‌యం.. ఇక చాలు.. దిగిపోతున్నా..

టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు అజింక్యా ర‌హానే (Ajinkya Rahane ) కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. రాబోయే దేశవాళీ సీజన్‌కు..

Ajinkya Rahane : అజింక్యా ర‌హానే కీల‌క నిర్ణ‌యం.. ఇక చాలు.. దిగిపోతున్నా..

Ajinkya Rahane steps down as captain of Mumbai cricket team

Updated On : August 21, 2025 / 2:05 PM IST

Ajinkya Rahane : టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు అజింక్యా ర‌హానే కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. రాబోయే దేశవాళీ సీజన్‌కు ముందు అత‌డు ముంబై జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇక పై ముంబైలో ఓ ఆట‌గాడిగా మాత్ర‌మే కొన‌సాగుతాన‌ని వెల్ల‌డించాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌హానే (Ajinkya Rahane) తెలిపాడు.

‘ముంబై త‌ర‌పున ఛాంపియ‌న్‌షిప్‌లు గెల‌వ‌డం, కెప్టెన్‌గా ప‌నిచేయ‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నా. ఇంకొన్ని రోజుల్లో కొత్త డొమెస్టిక్ సీజ‌న్ ప్రారంభం అవుతుంది. కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని అనుకుంటున్నా. అందుక‌నే కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నా. ఇక‌పై ముంబైలో ఓ ఆట‌గాడిగా మాత్ర‌మే కొన‌సాగుతా. నా అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తా. ముంబై జ‌ట్టుకు మ‌రిన్ని ట్రోఫీలు అందించ‌డంలో నా వంతు సాయం చేస్తా. ‘అని ర‌హానే రాసుకొచ్చాడు.

Hardik pandya : ఆసియాక‌ప్‌లో హార్దిక్ పాండ్యా 5 సిక్స‌ర్లు కొడితే..

ముంబై కెప్టెన్‌గా ర‌హానే ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2022-23లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, 2022-23లో దులీప్ ట్రోఫీ, 2023-24లో రంజీ ట్రోఫీల‌ను అందించాడు.

ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా త‌రుపున ర‌హానే 85 టెస్టులు, 90 వ‌న్డేలు, 20 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 38.5 స‌గటుతో 5077 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 సెంచ‌రీలు, 26 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. వ‌న్డేల్లో 35.3 స‌గ‌టుతో 2962 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు సెంచ‌రీలు, 24 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 20.8 స‌గ‌టుతో 375 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది.

Ajit Agarkar : చీఫ్ సెలెక్టర్ అగార్క‌ర్ కు బీసీసీఐ బంప‌ర్ ఆఫ‌ర్‌.. 2026 జూన్ వ‌ర‌కు తిరుగులేదు..

37 ఏళ్ల ర‌హానే చివ‌రిసారిగా టీమ్ఇండియా త‌రుపున 2023లో ఆడాడు. ఫామ్ కోల్పోవ‌డం, యువ ఆట‌గాళ్ల రాక‌తో జ‌ట్టులో అత‌డికి చోటు ద‌క్క‌డం లేదు.