Sanju Samson : ఆసియాకప్ 2025కి ముందు సంజూ శాంసన్ కీలక నిర్ణయం.. ఓపెనర్ కాదని చెప్పేశారా?
గత ఏడాది కాలంగా టీ20ల్లో అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ (Sanju Samson) ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.

Sanju Samson may be new role in Asia Cup 2025
Sanju Samson : సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ 2025 (Asia Cup 2025) ప్రారంభం కానుంది.ఈ మెగా టోర్నీలో ఆడే జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.15 మంది సభ్యులు గల బృందంలో సంజూ శాంసన్(Sanju Samson)కు చోటు దక్కింది.
కాగా.. గత ఏడాది కాలంగా టీ20ల్లో అభిషేక్ శర్మ(Abhishek Sharma)తో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆసియా కప్‌కు శుభ్‌మన్ గిల్ ఎంపిక కావడం, అతడికే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో అంతకముందు కొన్ని మ్యాచ్‌ల్లో గిల్ ఓపెనర్‌గానే ఆడాడు.దీంతో ఆసియా కప్‌లోనూ అభిషేక్ శర్మతో కలిసి అతడే ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి.
Rohit Sharma : ఆస్ట్రేలియా టూర్‌కు ముందు రోహిత్ శర్మ కీలక నిర్ణయం..!
అదే జరిగితే సంజూ కు జట్టులో స్థానం దక్కడం కాస్త కష్టమే. అయితే.. వికెట్ కీపర్ కూడా కావడం ఇక్కడ సంజూకు కాస్త కలిసి వచ్చే అంశం.ధ్రువ్ జురెల్ రేసులో ఉన్నప్పటికి అనుభవం దృష్ట్యా సంజూ తుది జట్టులోకి రావొచ్చు. అప్పుడు అతడి బ్యాటింగ్ ఆర్డర్ మారే అవకాశం ఉంది. వన్‌డౌన్‌లో లేదంటే మిడిల్ఆర్డర్‌లో ఆడాల్సి ఉంటుంది.
అందుకే ఇలానా..?
ఈ విషయం పై ఇప్పటికే టీమ్‌మేనేజ్‌మెంట్ నుంచి సంజూ శాంసన్‌కు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం శాంసన్ కేరళ క్రికెట్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో సంజూ ఓపెనర్‌గా బరిలోకి దిగడం లేదు. కోచి బ్లూ టైగర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజూ మిడిల్ ఆర్డర్‌లో ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఎందుకంటే తాజాగా జరిగిన మ్యాచ్‌లో తన జట్టు రెండు వికెట్లు కోల్పోయిన కూడా అతడు క్రీజులోకి రాలేదు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి నిర్దేశించిన 98 పరుగుల లక్ష్యాన్ని సంజూ జట్టు 11.5 ఓవర్లలో అందుకుంది.
Ajinkya Rahane : అజింక్యా రహానే కీలక నిర్ణయం.. ఇక చాలు.. దిగిపోతున్నా..
దీన్ని బట్టి చూస్తుంటే.. ఆసియా కప్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగడని అర్థమవుతోంది. అతడిని మిడిల్ ఆర్డర్‌లో లేదంటే ఫినిషర్‌గా ఆడించే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో కేరళ లీగ్‌లో శాంసన్ ఓపెనర్‌గా రావడం లేదని అంటున్నారు.