Best Budget Phones : కొత్త ఫోన్ కావాలా? మీ పేరెంట్స్ కోసం రూ. 15వేల లోపు 3 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీఇష్టం..!

Best Budget Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. మీ పేరంట్స్ కోసం రూ.15వేల లోపు ధరలో టాప్ 3 స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి.

Best Budget Phones : కొత్త ఫోన్ కావాలా? మీ పేరెంట్స్ కోసం రూ. 15వేల లోపు 3 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీఇష్టం..!

Best Budget Phones

Updated On : August 22, 2025 / 3:07 PM IST

Best Budget Phones : మీ తల్లిదండ్రుల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ కొని వారికి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ప్రస్తుతం రూ. 15వేల లోపు ధరలో (Best Budget Phones) టాప్ 3 బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు బిగ్ డిస్‌ప్లే, అద్భుతమైన ప్రాసెసర్, ఆకర్షణీయమైన కెమెరా సెటప్, భారీ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తాయి. ఆగస్టు 2025లో ఫ్లిప్‌కార్ట్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆప్షన్లతో ఈ స్మార్ట్‌ఫోన్లను ఇంటికి తెచ్చుకోవచ్చు.

1. మోటో G45 5G :
మోటో G45 5G బెస్ట్ ఫోన్. 6.5 అంగుళాల HD ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120Hz రేటుతో వస్తుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్‌ను పొందవచ్చు. చాలా మంచి ప్రాసెసర్ కూడా. మీ తల్లిదండ్రులు ఫోన్‌లో ఎక్కువసేపు కంటెంట్‌ను చూసేవారు అయితే ఈ ఫోన్ వారికి చాలా బాగుంటుంది. మీరు 5000mAh లాంగ్ బ్యాటరీని 20వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో పొందవచ్చు. బ్యాక్ సైడ్ 50MP+2MP కెమెరా సెటప్ లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది.

సెక్యూరిటీ విషయానికి వస్తే.. కంపెనీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ IP52 స్ప్లాష్ రెసిస్టెంట్ డిజైన్‌తో వస్తుంది. హైరిజల్యూషన్ ఆడియోతో డాల్బీ అట్మోస్ సపోర్టు లభిస్తుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌కు దాదాపు రూ. 10,999, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌కు దాదాపు రూ. 12,999 చెల్లించాల్సి ఉంటుంది.

2. శాంసంగ్ గెలాక్సీ F06 5G :
శాంసంగ్ గెలాక్సీ F06 5G ఫోన్ 6.7 అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లేతో వస్తుంది. అద్భుతమైన 60Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌ పొందవచ్చు. మల్టీ టాస్కింగ్, కంటెంట్ వినియోగానికి బెస్ట్ ఫోన్. బ్యాక్ సైడ్ 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్‌ కూడా పొందవచ్చు.

Read Also : EPFO Subscribers : ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్.. డెత్ రిలీఫ్ ఫండ్ ఎక్స్‌గ్రేషియా రూ. 15లక్షలకు పెంపు.. ఫుల్ డిటెయిల్స్..!

ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరా పొందవచ్చు. ఈ ఫోన్‌లో 5000mAh లాంగ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. బ్రాండ్ 2 జనరేషన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను కూడా అందిస్తుంది.

సెక్యూరిటీ బెనిఫిట్స్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాయిస్ ఫోకస్ ఫీచర్‌ కూడా పొందవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్‌లో కంటెంట్‌ సేవ్ చేయాలంటే మైక్రో SD కార్డ్ ద్వారా ఇంటర్నల్ స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించవచ్చు.

ఈ ఫోన్‌ను మీ తల్లిదండ్రుల కోసం కొనాలంటే 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌కు దాదాపు రూ. 9,499 చెల్లించాలి. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌కు దాదాపు రూ. 10,999 చెల్లించాలి.

3. రెడ్‌మి 13 5G :

రెడ్‌మి 13 5G ఫోన్ 6.79 అంగుళాల ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌ సులభంగా పొందవచ్చు. మీ తల్లిదండ్రుల కోసం మొబైల్ ఫోన్‌ కొనేందుకు చూస్తుంటే ఈ ఫోన్ ఇవ్వొచ్చు. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 యాక్సిలరేటెడ్ ఎడిషన్ చిప్‌సెట్ బాగుంది. ఎలాంటి లాగ్‌ ఉండదు. పైగా ప్రాసెసర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

బ్యాక్ సైడ్ 108MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. 5030mAh భారీ బ్యాటరీ బ్యాకప్‌ కలిగి ఉంది. ఫోన్‌ త్వరగా ఛార్జ్ చేసేందుకు 33వాట్ల ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది. ఈ ఫోన్‌ ధర దాదాపు రూ. 13,999 నుంచి ఉంటుంది.