UPSC : బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. దరఖాస్తుకు రేపే లాస్ట్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022 ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి రేపే (అక్టోబర్ 12,2021) లాస్ట్ డేట్. UPSC ESE 2022

UPSC : బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. దరఖాస్తుకు రేపే లాస్ట్

Upsc Engineering Services

UPSC Engineering Services : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022 ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి రేపే (అక్టోబర్ 12,2021) లాస్ట్ డేట్. UPSC ESE 2022 ఎగ్జామ్‌కు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 22, 2021 నుంచి ప్రారంభమైంది. సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో మొత్తం 247 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Almond Milk : బాదం పాలు అతిగా తాగుతున్నారా? అయితే డేంజర్ లో పడ్డట్టే?

విభాగాలు: సివిల్‌, మెకానికల్‌‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో పోస్టులు భర్తీ.

విద్యార్హ‌త‌లు..
* గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి బీఈ/ బీటెక్ చ‌దివి ఉండాలి.
లేదా..
* ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) ఇన్ స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ A, B విభాగాలను క్లియర్ చేసి ఉండాలి
లేదా..
* ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ II మరియు III/సెక్షన్లు A మరియు B లలో అర్హత సాధించాలి.
లేదా..
* ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ ఇన్ స్టిట్యూషన్ (ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష పాసై ఉండాలి.

వయసు: అభ్యర్థులు వయసు 01-01-2022 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

AICTE : విద్యార్థులకు శుభవార్త.. నెలకు రూ.12,400.. అర్హతలు, దరఖాస్తు విధానం..

ఎంపిక విధానం..
* ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఎంపిక.
* ఇంజనీరింగ్ సర్వీస్ ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహిస్తారు.
* అనంతరం పర్సనాలిటీ టెస్ట్ ద్వారా అభ్యర్థి ఎంపిక.

దరఖాస్తు ఫీజు: మహిళా/ ఎస్సీ /ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు. ఇతరులు మాత్రం రూ.200 చెల్లించాలి.

దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 22, 2021

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 12, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.upsc.gov.in/

పరీక్ష కేంద్రాలు.. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం

దరఖాస్తు చేసే అభ్యర్థులు ముందుగా పార్ట్-1, పార్ట్-2 అప్లికేషన్ పూర్తి చేయాలి. ఫిబ్రవరి 20 2022న యూపీఎస్సీ ఈఎస్ఈ ఎగ్జామ్ నిర్వహించనుంది.

అలాగే.. కేంద్ర సర్వీసుల్లో జియాలజిస్ట్‌ తదితర గ్రూప్‌-ఏ పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామ్‌ 2022 నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 192 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్‌ 12 దరఖాస్తులకు చివరి తేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.