Almond Milk : బాదం పాలు అతిగా తాగుతున్నారా? అయితే డేంజర్ లో పడ్డట్టే?…

జంతువుల పాలల్లో కంటే బాదం పాలల్లో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇది ​కూడా అరోగ్యానికి హానికారకమే. నట్స్‌ అలర్జీ ఉన్నవారు సాధారణంగా బాదం పాలు తీసుకోకపోవడమే మంచిది.

Almond Milk : బాదం పాలు అతిగా తాగుతున్నారా? అయితే డేంజర్ లో పడ్డట్టే?…

Almonds Milk

Almond Milk : బాదంలో ఆరోగ్యానికి మేలు చేసే బలవర్ధకమైన ఆహారంగా చెప్పవచ్చు. బాదంలో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఫైబర్‌, ప్రొటీన్‌, విటమిన్‌ ‘ఇ’, మాగ్నిషియం, మాంగనీస్‌, కాపర్‌, పాస్పరస్‌.. వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలకు పుష్టి, బరువు అదుపులో ఉంచడం, మానసిక స్థితిని మెరుగుపరచడం, గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడం..తక్షణశక్తిని ఇవ్వటం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

అయితే చాలా మంది బాదం ను పాల రూపంలో తాగుతుంటారు. ఇది ఒకరకమైన పానీయంగా వేసవిలో ఎక్కువ జ్యూస్ షాపుల్లో విక్రయిస్తుండటాన్ని మనం చూడవచ్చు. చాలా మంది బాదం పాలను ఇష్టంగా తాగుతారు. ఒకటి కంటే ఎక్కవ గ్లాసుల బాదం పాలను తాగేందుకు ఉత్సాహం చూపిస్తారు. రుచికలిగి ఉండే ఈ బాదం పాలల్లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉపవాస దీక్షలో ఉన్నవారు తక్షణ శక్తి కోసం బాదం పాలను తీసుకుంటుంటారు.

బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వరకు కలిపి తయారు చేస్తారు. బాదం పాలను మోతాదుకు మించి మితిమీరి తాగటం వల్ల వివిధ రకాల అలర్జీలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అధికంగా తీసుకుంటే వీటిల్లోని మినరల్స్‌, నూట్రియన్స్‌ అవసరానికి మించడం వల్ల వాంతికి రావడం, కడుపులో అసౌకర్యం, విరేచనాలు, పేగు అనారోగ్యం.. వంటి జీర్ణ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

జంతువుల పాలల్లో కంటే బాదం పాలల్లో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇది ​కూడా అరోగ్యానికి హానికారకమే. నట్స్‌ అలర్జీ ఉన్నవారు సాధారణంగా బాదం పాలు తీసుకోకపోవడమే మంచిది. లాక్జోస్‌ అలర్జీలున్నవారు కూడా బాదం పాలకు దూరంగా ఉండటమే మేలు. బాదం పాలను గోయిట్రోజెనిక్ ఆహారంగా పరిగణిస్తారు. అంటే ఈ విధమైప ఆహారాలు థైరాయిడ్‌ సమస్య తలెత్తడానికి కారణమవుతాయన్నమాట. వీటిని అధికమోతాదులో తీసుకుంటే థైరాయిడ్‌కు హాని కలిగించే రసాయనాలు విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి. థైరాయిడ్‌తో బాధపడేవారు బాదం పప్పు, బాదం పాలు మితంగా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లలకు అవసరమైన సరైన పోషకాలు కూడా దీనిలో అంతగా ఉండవు. తల్లిపాలకు ప్రత్యామ్నాయం కాదు. అందువల్లే వీటిని చిన్నారులకు పట్టించకూడదు. ఇందులో ప్రొటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. బాదం పాలు అతిగా తాగే వాళ్ళు వాటిని తాగే ముందు ఆరోగ్యపరమైన సమస్యలను ముందుగా తెలుసుకోవటం మంచిది. అతిగా బాదం పాలను తాగటం అంత శ్రేయస్కరం కాదని గుర్తుంచుకోవాలి. తక్కువ మోతాదులో తాగటం వల్ల ఆరోగ్యపరంగా మేలు కలుగుతుంది.