Samantha : డైరెక్టర్‎గా సమంత..! హీరో ఎవరంటే..?

టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంత(Samantha), ఇప్పుడు కొత్త రోల్‌ ఎంచుకోబోతుందట.

Samantha : డైరెక్టర్‎గా సమంత..! హీరో ఎవరంటే..?

Samantha Ruth Prabhu Turns Director

Updated On : August 22, 2025 / 1:56 PM IST

Samantha : టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంత(Samantha), ఇప్పుడు కొత్త రోల్‌ ఎంచుకోబోతుందట. ఏ మాయ చేసావేతో తెలుగు తెరకు పరిచయమై..రంగస్థలం, మజిలీ వంటి సినిమాలతో స్టార్‌డమ్ అందుకున్న ఈ అమ్మడు, ఇటీవల నటనతో పాటు సినిమా ప్రొడక్షన్‌లోనూ సత్తా చాటింది.

తన సొంత బ్యానర్‌లో శుభం సినిమాను నిర్మించి, హర్రర్ కామెడీ జోనర్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూనే, తన కెరీర్‌లో కొంత చాప్టర్‌ను తెరిచేందుకు రెడీ అవుతోందట. డైరెక్టర్‌గా మారి మెగాఫోన్ పట్టబోతోందట సమంత.

Mega 157 : చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా టైటిల్ వచ్చేసింది.. మెగా 157 టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. మెగాస్టార్ లుక్స్ అదుర్స్..

ఆమె ఒక క్యూట్ లవ్ స్టోరీతో దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకోవడానికి సిద్ధమవుతోందట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆమె ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్నట్లు, కొంతమంది అప్‌ కమింగ్, యంగ్ ఆర్టిస్టులతో డిస్కషన్స్‌ జరుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సమంత గతంలో నటిగా విభిన్న పాత్రలతో ఆకట్టుకున్నట్లే, డైరెక్టర్‌గా కూడా తనదైన ముద్ర వేయాలని పట్టుదలతో ఉందట.

Chiranjeevi Birthday : గోవాలో చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ స్పెషల్ పోస్ట్.. వీడియో వైరల్..

ఈ లవ్ స్టోరీ ఆమె సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కే అవకాశం ఉందని టాక్. ఈ వార్తలు సమంత అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్- 2, సిటాడెల్, హనీ బన్నీ వంటి వెబ్ సిరీస్‌లలో యాక్షన్ రోల్స్‌తో మెప్పించిన సమంత, డైరెక్షన్‌లో ఫ్యాన్స్‌ ఎలా ఆకట్టుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.

క్యూట్ లవ్ స్టోరీలో ఆమె ఎలాంటి కొత్త కోణాన్ని చూపిస్తుంది, ఏ స్టార్ నటీనటులు ఈ పిక్చర్‌లో కనిపిస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే సమంత డైరెక్టర్‌గా అరంగేట్రం చేయబోతున్నది గాసిపో..లేక రియల్ తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.