Rain Alert : దూసుకొస్తున్న ముప్పు.. బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలెర్ట్ జారీ..

Rain Alert : బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కొనసాగుతుండగానే.. మరొకటి ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.

Rain Alert : దూసుకొస్తున్న ముప్పు.. బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలెర్ట్ జారీ..

Rain Alert

Updated On : November 26, 2025 / 6:57 AM IST

Rain Alert : ఏపీ వాసులకు అలర్ట్.. రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టబోతున్నాయి. బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కొనసాగుతుండగానే.. మరొకటి ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.

మల్కా జలసంధి సమీపంలోని ఇప్పటికే తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది మరింత బలపడి.. వచ్చే 24గంటల్లో పశ్చిమ దిశగా, తరువాత 24గంటల్లో పశ్చిమ – వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. అయితే, ఈ అల్పపీడనం తుపానుగా మారేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇది ఎటువైపు వెళ్తుంది.. ఎక్కడ తీరాన్ని తాకుతుందనే విషయాలు మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు అంచనా వేశారు. శనివారం లేదా ఆదివారం నాటికి తమిళనాడు, ఏపీ తీరాల వైపు వెళ్తుందని అంచనా వేస్తుంగా.. మరోవైపు సముద్రంలోనే బలహీనపడుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక, భూమధ్య రేఖకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర – వాయువ్య దిశగా కదులుతూ బుధవారానికి తీవ్ర అల్పపీడనంగా మారుతుంది.. ఆ తరువాత 24గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండం మరింత బలపడి ఉత్తర తమిళనాడు వైపు కదులుతుందని, దీంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ వాయుగుండం ప్రభావంతో ఈ నెల 29వ తేదీ నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 29వ తేదీ (శనివారం) ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

30వ తేదీ (ఆదివారం) ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అదేవిధంగా.. శ్రీసత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ విభాగం పేర్కొంది.

భారీ వర్షాలతోపాటు వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని.. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు.