AP Weather : రాబోయే 24గంటల్లో వర్ష బీభత్సం.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..

AP Weather : తీవ్ర వాయుగుండగా బలపడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదలుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

AP Weather : రాబోయే 24గంటల్లో వర్ష బీభత్సం.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..

AP Weather

Updated On : November 26, 2025 / 10:02 AM IST

AP Weather : తీవ్ర వాయుగుండంగా బలపడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదలుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 24గంటల్లో ఇది తుపానుగా బలపడనుందని అంచనా వేస్తున్నారు. దీనికి సెన్యార్‌గా నామకరణం చేశారు.

నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా పయణించి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్‌తో దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

Also Read: Telangana Police : అయ్యప్ప మాల ధరించిన వారికి బిగ్‌షాక్.. జుట్టు పెంచుకొని, యూనిఫాం, బూట్లు లేకుండా విధుల్లోకి రావొద్దు.. కఠిన ఆంక్షలు

ఈనెల 28నుంచి కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా తీరంలో 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రేపటి నుంచి దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.