Mega 157 : చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా టైటిల్ వచ్చేసింది.. మెగా 157 టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. మెగాస్టార్ లుక్స్ అదుర్స్..

తాజాగా నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 157 సినిమా టైటిల్ అనౌన్స్ చేసారు. (Mega 157)

Mega 157 : చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా టైటిల్ వచ్చేసింది.. మెగా 157 టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. మెగాస్టార్ లుక్స్ అదుర్స్..

Updated On : August 22, 2025 / 12:23 PM IST

Mega 157 : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, చిరు కూతురు సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.(Mega 157)

Also Read : Chiranjeevi Movie : చిరంజీవి బర్త్ డే రోజు రిలీజయిన మెగాస్టార్ ఏకైక సినిమా ఏంటో తెలుసా? కల్ట్ క్లాసిక్..

చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ కామెడీ జానర్లో ఈ సినిమా ఉండనుంది. ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో దిగనుంది. తాజాగా నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ముందు నుంచి రూమర్స్ ఉన్నట్టే ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్ ని అనౌన్స్ చేసారు. ఈ గ్లింప్స్ లో చిరంజీవి లుక్స్ అదిరిపోయాయి. గ్లింప్స్ చూస్తుంటే పక్కా కమర్షియల్ హిట్ సినిమా అని తెలుస్తుంది. ఈ గ్లింప్స్ కి వెంకటేష్ వాయిస్ ఇచ్చారు. సినిమాలో కూడా వెంకటేష్ కీలక పాత్రలో నటించబోతున్నారు.