Village Secretariat Posts: గ్రామ, వార్డు సచివాలయాల్లో 2,778 పోస్టులు.. ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో(Village Secretariat Posts) ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Government decides to fill 2,778 village and ward secretariat posts
Village Secretariat Posts: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 2,778 డిప్యూటేషన్, ఔట్‌సోర్సింగ్ పోస్టుల(Village Secretariat Posts) భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈమేరకు రాష్ట్ర మంత్రి పార్థసారథి అధికారిక ప్రకటన చేశారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇప్పటికే ఉన్న ఉద్యోగాలతో పాటు అదనంగా మరో 1,785 గ్రామ, వార్డు సచివాలయాలలో 993 కొత్త పోస్టులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ కొత్త పోస్టుల నియకమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిపారు.
Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 700 పైగా ఉద్యోగాలతో భారీ జాబ్ మేళా.. పూర్తి వివరాలు మీకోసం
చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వసతుల పెంపు:
చింతూరులో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)ను 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయాలన్నీ రాష్ట్రంలో పరిపాలనను మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలను అందించడం, వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసమే అని మంత్రి పేర్కొన్నారు.