Andhra Pradesh MLAs: ఎమ్మెల్యేలూ జాగ్రత్త.. సోషల్ మీడియా ఇరికిస్తుంది.. ఇప్పటికే ఏం జరిగిందంటే?

ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు రాజకీయంగా మండించేశాయి. ఎక్కడ చూసినా వీరి గురించే చర్చ సాగుతూ వస్తోంది.

Andhra Pradesh MLAs: ఎమ్మెల్యేలూ జాగ్రత్త.. సోషల్ మీడియా ఇరికిస్తుంది.. ఇప్పటికే ఏం జరిగిందంటే?

Social Media

Updated On : August 19, 2025 / 8:36 PM IST

Andhra Pradesh MLAs: మాట్లాడే ప్రతి మాట ఎంతో ముఖ్యం. అందులో ఇలాంటి విషయాల్లో రాజకీయ నాయకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పబ్లిక్‌గా ఏం మాట్లాడట్లేదు. ఇంటర్నల్‌గా నలుగురి మధ్యే డిస్కస్ చేశామ్. లేకపోతే తెలిసిన కార్యకర్తతోనో..లీడర్‌తోనే ఫోన్‌లోనే మాట్లాడాం..నమ్మకస్తుడు బయటికి చెప్పడు..మనం మాట్లాడింది ఎవరికి తెలియదు అనుకుంటే పొరపాటే.

రంగం ఏదైనా సోషల్ మీడియా కీరోల్ అయిపోయిన నేపథ్యంలో..ఎప్పుడు ఎందుకు సోషల్‌ మీడియాలో ట్రోల్ అవుతారో..ఏ లీడర్‌ మీద ఎందుకు పాజిటివిటీ క్రియేట్ అవుతుందో..ఎందుకు నెగెటివ్‌ ప్రాపగండం నడుస్తుందో ఏ లీడర్ అంచనా వేయలేరు.

Also Read: Hari Hara Veera Mallu OTT Release Date: హరిహర వీరమల్లు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..

ఆ మాట కొస్తే ప్రతీ పొలిటిషియన్‌ ఇప్పుడు సోషల్ మీడియాను అస్త్రంగా మల్చుకుంటున్నారు. తాము చేసే ప్రతి పనిని..పర్సనల్ లైఫ్‌ నుంచి పబ్లిక్‌ లైఫ్‌ వరకు..అంతా నెట్టింట పెట్టేస్తున్నారు.

పరామర్శలు, శుభకార్యాలు, సాయం చేసినట్లు పోస్టులు, అధికారులతో రివ్యూలు..ఇలా ఇంట్లో నుంచి కాలు బయటపెట్టినప్పటి నుంచి మళ్లీ ఇంటికి వచ్చేవరకు ప్రతీ మూమెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇలా ఎంతో మంది లీడర్లకు ఫుల్ మైలేజ్ వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్లున్నారు. సేమ్‌టైమ్‌ అదే సోషల్ మీడియా పుణ్యాన ఆకాశమంత ఎత్తు నుంచి ఆగమైపోయిన నేతలు లేకపోలేదు.

మాట్లాడే ప్రతీ మాటను గమనించే త్రినేత్రం ఒకటి ఉంటుంది. అదే సోషల్‌ మీడియా. ఈ విషయం ఎవరు గుర్తుంచుకున్న గుర్తుంచుకోలేకపోయినా డోంట్‌ వర్రీ. (Andhra Pradesh MLAs)

పొలిటికల్ లీడర్స్‌కు మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ఏ మాత్రం టంగ్ స్లిప్‌ అయినా..ఎక్కడ తమ బిహేవియర్‌ డిఫరెంట్‌గా కనిపించినా..సోషల్ మీడియా చెడుగుడు ఆడేస్తుంది. ఆ తర్వాత ఎన్ని వివరణలు ఇచ్చుకున్న..అందుకు కౌంటర్‌గా సోషల్‌ మీడియాలో ఎన్ని పోస్టులు పెట్టించిన డ్యామేజ్ జరిగిపోతూనే ఉంటుంది.

అందుకే సోషల్ మీడియాతో ఇప్పుడు అగ్గితో ఆడుకున్నట్లే ఉంది పరిస్థితి. ఏపీలో ఈ మధ్య నలుగురైదుగురు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాకు చిక్కి ఇరకాటంలో పడిపోయారు. ఎప్పటి ఆడియోలో తెలియదు..ఎప్పటి వీడియోలు అంతకంటే క్లారిటీ ఉండదు. పైగా ఎవరు బయటపెట్టారో అంతకంటే పసిగట్టలేరు. నిమిషాల్లో సుడిగండంలా సోషల్‌ మీడియా కమ్మేస్తుంది. లీడర్‌ బయటికి వివరణ ఇచ్చుకున్నా..క్యారెక్టర్‌ మీద మచ్చపడ్డాక ఎంత తుడుచుకున్నా పోయే పరిస్థితి కనిపించట్లేదు.

ఏపీలో సీఎం చంద్రబాబు అయితే పదేపదే ఎమ్మెల్యేలకు సూచిస్తున్నది ఇదే. సోషల్ మీడియాను విరివిగా వాడండి. కానీ చేసే ప్రతి పని..మాట్లాడే ప్రతీ మాట జాగ్రత్త. మూడో కన్నురూపంలో సోషల్‌ మీడియా మిమ్మల్ని గమనిస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తున్నారు చంద్రబాబు. ఈ మధ్య నలుగురైదుగురు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాకు చిక్కి ఇరకాటంలో పడిపోయారు. గవర్నమెంట్‌ వచ్చిన స్టార్టింగ్‌లోనే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు అంటూ వీడియోలు వైరల్ అయ్యాయి.

ముగ్గురు మంత్రుల తీరు కూడా..
ఇమిడీయేట్‌గా సదరు ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారు చంద్రబాబు. అలాగే ఇద్దరు ముగ్గురు మంత్రుల తీరు కూడా నెట్టింట విమర్శలకు దారి తీసింది. వెంటనే వారిని మందలించి సెట్‌రైట్ చేసే ప్రయత్నం చేశారు బాబు. ఈ మధ్య జనసేన నేత కిరణ్ రాయల్‌ రాసలీలలు అంటూ సోషల్ మీడియాలో రచ్చరంబోల అయింది. వెంటనే ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారు జనసేన అధినేత. లేటెస్ట్‌గా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌కు సంబంధించి కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది.

ఇక ఇప్పుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో ఇప్పుడు ఏపీని షేక్ చేస్తోంది. వైసీసీ మాజీమంత్రి పేర్నినాని కూడా కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్మన్ దాడి లోకేశ్‌ కుట్ర అంటూ ప్రచారం చేయాలంటూ ఆయన ఫోన్ మాట్లాడుతున్న వీడియో ఒకటి బాగా సర్క్యులేట్ అయింది. గతంలో వైసీపీ నేతలు తీరు సోషల్‌ మీడియాలో విమర్శలకు దారి తీసి..ఆ పార్టీని నిండా ముంచిందన్న టాక్ ఉంది.

ఒకవైపు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. అభివృద్ధి ఎజెండాను ముందు పెట్టుకుని అడుగులు వేస్తున్నారు. వీటన్నింటిని జనంలో తీసుకెళ్లడం కంటే కొంతమంది ఎమ్మెల్యేల తీరే హైలెట్ అవుతోంది. వారు చేస్తున్న పనులే జనంలోకి చర్చకు వస్తున్నాయి. అయితే కొందరు ఏ తప్పు చేయకున్నా సోషల్ మీడియా ట్రోల్స్‌కు బలి అవుతుంటే..కొందరు అతి చేస్తూ ఇట్టే ఇరికపోతున్నారట.

దాంతో పార్టీకి, ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు బ్యాడ్‌ నేమ్‌ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కూటమి ఎంత ప్రచారం చేస్తున్నా..దానిని మించి ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న వ్యవహారాలే చర్చకు వస్తున్నాయంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు రాజకీయంగా మండించేశాయి. ఎక్కడ చూసినా వీరి గురించే చర్చ సాగుతూ వస్తోంది.

అనంతపురం ఎమ్మెల్యే కానీ అలాగే గుంటూరులో ఉన్న మరో ఎమ్మెల్యే కానీ ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇంకో ఎమ్మెల్యే కానీ..సోషల్ మీడియా నిఘాకు చిక్కి కాంట్రవర్సీలో ఇరుక్కుపోయారు. ఏదైనా సోషల్ మీడియా విషయంలో పొలిటికల్‌ లీడర్లు..ప్రత్యేకంగా అధికారపార్టీ నేతలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి.