Cji
CJI NV Ramana : ఏపీ సీఎం జగన్ దంపతులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని నోవాటెల్ లో ఉన్న..రమణను సీఎం జగన్..భారతిలు కలిశారు. గత మూడు రోజులుగా కడప జిల్లాలో ఆయన పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, పలు పథకాల అమలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2021, డిసెంబర్ 25వ తేదీ శనివారం మధ్యాహ్నంతో పర్యటన ముగిసింది. అనంతరం విజయవాడకు చేరుకుని…సీజేఐ ఎన్వీ రమణను కలుసుకున్నారు.
Read More : Shameful Incident: కూతురిపై తండ్రి అత్యాచారం.. పోక్సో చట్టం కింద కేసు నమోదు
2021, డిసెంబర్ 26వ తేదీ ఏపీ రాష్ట్రస్థాయి న్యాయాధికారుల రెండో సదస్సుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే రోజున ఏపీ హైకోర్టుకు వచ్చారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం, బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సన్మానంలో పాల్గొన్నారు. డిసెంబర్ 24వ తేదీ శుక్రవారం కృష్ణా జిల్లాలోని స్వగ్రామం పొన్నవరం వెళ్లారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి ఆయన సొంతూరు వచ్చారు. ఈ సందర్భంగా..ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. 25వ తేదీన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.