నవరత్నాల్లోని మరో కీలక పథకాన్ని ఇవాళ(జనవరి 9,2020) ప్రారంభిస్తున్నారు సీఎం జగన్. చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్న సంకల్పంతో రూపొందించిన ఈ పథకాన్ని
నవరత్నాల్లోని మరో కీలక పథకాన్ని ఇవాళ(జనవరి 9,2020) ప్రారంభిస్తున్నారు సీఎం జగన్. చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్న సంకల్పంతో రూపొందించిన ఈ పథకాన్ని చిత్తూరులో ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం.. అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభిస్తున్నారు సీఎం జగన్. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంక్ అకౌంట్‌లో ఏడాదికి 15వేల రూపాయలు వేస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని ముందుగా ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అమలు చేయాలని భావించినా.. తరువాత ఇంటర్ వరకు వర్తింపజేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరనుంది.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క చిన్నారి బడికి దూరం కాకూడదన్న ఆశయంతో సీఎం జగన్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.6వేల 500 కోట్లు కేటాయించారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా జనవరిలో నేరుగా బ్యాంక్ అకౌంట్లలో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు.
చిత్తూరులోని పి.వి.కె.ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో అమ్మ ఒడి పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం జగన్. తరువాత జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
* చిత్తూరులో అమ్మ ఒడి ప్రారంభించనున్న సీఎం జగన్
* నేరుగా తల్లులకు నగదు బదిలీ
* బడ్జెట్‌లో రూ.6500 కోట్ల కేటాయింపు
* ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లులకు వర్తింపు
* ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, గురుకులాలకు వర్తింపు
* ఏడాదికి రూ.15వేలు ఆర్థికసాయం
* ఇంటర్ విద్యార్ధులకూ వర్తింపు
* దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ది
Also Read : రాజధానిపై రెఫరెండం పెట్టండి లేదా ఎన్నికలు పెట్టండి : చంద్రబాబు డిమాండ్