CM Ys Jagan: వైసీపీ నేతలతో జగన్ భేటీ
వైసీపీ కీలక నేతలతో ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు.
- Narender Thiru
- Published On : April 27, 2022 / 04:04 PM IST
Ys Jagan
CM Ys Jagan: వైసీపీ కీలక నేతలతో ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు. 2024 ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలి, నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న నేతలకు జగన్ పలు కీలక సూచనలు చేశారు. అందరూ సమన్వయంతో ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు.
CM Ys Jagan: వచ్చే నెలలో సీఎం జగన్ దావోస్ పర్యటన
ఈ విషయంలో మంత్రులు, జిల్లాల అధ్యక్షులు ప్రధాన బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం సంక్షేమం ఎంత వరకు చేరుతోంది? వీటి వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ప్రజలు తెలుసుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పార్టీని బలోపేతం చేస్తూ ముందుకుసాగాలని నేతలకు సూచించారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. త్వరలో జగన్ జిల్లాల పర్యటనలు చేస్తారని, దీనికి సంబంధించిన షెడ్యూల్‌పై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
