×
Ad

ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మమేంటి?

కూటమి పాలనలో కమ్మతనం పోవాలని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. కమ్మతో పాటు అన్ని కులాలు ఉన్నాయని గుర్తించాలన్న ఆయన పనిచేసే వారికే పదవులు ఇవ్వాలంటూ కామెంట్స్ చేశారు.

Adinarayana Reddy

  • ఫ్రస్ట్రేషన్ పీక్స్..కూటమి లీడర్ల రాగం మారుతోందా? 
  • మొన్న బొలిశెట్టి.. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి కామెంట్స్
  • పదవులు దక్కట్లేదనే లీడర్లు బరస్ట్ అవుతున్నారా?

Coalition Politics: మూడు పార్టీలు కూటమిగా పొత్తులో ఉన్నాయ్‌. పైగా పవర్‌లో కొనసాగుతున్నారు. దీంతో పార్టీ పదవి అయినా..ప్రభుత్వ పోస్ట్ కోసమైనా..అన్ని పార్టీల్లో రేసు నెక్స్ట్‌ లెవల్‌లో ఉంటోంది. కాంట్రాక్టులు, పనులు ఇలా ఎవరి అవసరాలు వాళ్లకు ఉంటాయ్.

ఓ వైపు సీనియారిటీ..మరోవైపు క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌..ఇంకోవైపు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు పదవుల కేటాయింపు..ఇలా అన్ని సెట్‌ చేయడం కూటమి పెద్దలకు హెడెక్‌గానే ఉంది. అయితే కోరుకున్నట్లు పదవులు..ఆశించినట్లుగా పనులు జరగకపోవడంలో అటు జనసేన, ఇటు బీజేపీ నేతల అప్పుడప్పుడు బరస్ట్ అవుతున్నారు.

పలువురు తెలుగు తమ్ముళ్లలోనూ పొత్తుతో తమకు పదవుల్లో అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నా.. బయట పడట్లేదు. అయితే ఏ పార్టీలో అయినా వలస వచ్చిన నేతలే అసంతృప్తిని బయటపెడుతూ వస్తున్నారట. ఈ క్రమంలో ఈ మధ్య ఇద్దరు నేతలు చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. ఇటీవలే బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యలు జనసేనకు దూరంగా ఉంటానని చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయితే ఔట్ రైట్ బరస్ట్ అయిపోయారు.

Also Read: Video: క్లాస్‌రూమ్‌లో అమ్మాయిని కాల్చి చంపి, తానూ కాల్చుకుని.. 3 క్షణాల్లో అంతా జరిగిపోయింది.. విద్యార్థులు పరుగులు

కూటమిలో అంతా బానే ఉంది. ముగ్గురు అధినేతలు కలిసే పనిచేస్తున్నారు. చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా ఎప్పటికప్పుడు సెట్‌రైట్‌ చేసుకుని తామంతా ఒక్కటేనన్న సంకేతం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడక్కడ లీడర్ల అసంతృప్తి నిజం. ఇది కామన్ కూడా. టీడీపీకి గ్రామగ్రామాన క్యాడర్, సంస్థాగత నిర్మాణం ఉంటుంది.

లైన్ దాటి కామెంట్స్ చేయడమే హాట్ టాపిక్
అధికారం, ప్రతిపక్షం అని సంబంధం లేకుండా బీజేపీ జెండా మోసే కార్యకర్తలు ఉంటారు. జనసేన వెంట నడిస్తే పదవులు వస్తాయని ఆశపడ్డ వారు ఉన్నారు. అందరికీ ఆశించినట్లు పనులు జరగాలని లేదు. కోరుకున్న పదవులు దక్కే పరిస్థితి కూడా ఉండదు. అలాంటప్పుడు అసంతృప్తి ఆవేదన ఉండటంలో కూడా తప్పులేదు. కాకపోతే లైన్ దాటి కామెంట్స్ చేయడమే హాట్ టాపిక్ అవుతోంది.

కాంగ్రెస్‌లో ఎదిగి వైసీపీలో కొనసాగి టీడీపీ మీదుగా బీజేపీలో చేరిన జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి రూటే సెపరేటు. హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలవడం ఆయన స్పెషాలిటీ. లేటెస్ట్‌గా కడప జిల్లా జమ్మలమడుగులో బీజేపీ సమావేశంలో మరోసారి సంచలన కామెంట్స్ చేసి చర్చకు ఆస్కారం ఇచ్చారు ఆదినారాయణ రెడ్డి. కూటమి పాలనలో అంతా కమ్మ కమ్మగా ఉందంటూ ఆదినారాయణ రెడ్డి మాట్లాడటం హాట్ టాపిక్ అయింది.

అప్పట్లో ఎన్టీఆర్ పాలన కమ్మగా ఉండేదని, ఇప్పుడు ఏపీలో కూటమి పాలన అంతకంటే కమ్మగా ఉందని ఆదినారాయణరెడ్డి పోల్చి చెప్పడం మరో విశేషం. కమ్మగా ఉందంటే మీ అందరికీ అర్థమైంది కదా అని ఆదినారాయణ రెడ్డి పార్టీ క్యాడర్‌ను గిచ్చి మరీ జోలపడినట్లు అడగడం ఆసక్తికరంగా మారింది.

కమ్మతో పాటు అన్ని కులాలు ఉన్నాయని కామెంట్స్
కూటమి పాలనలో కమ్మతనం పోవాలని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. కమ్మతో పాటు అన్ని కులాలు ఉన్నాయని గుర్తించాలన్న ఆయన పనిచేసే వారికే పదవులు ఇవ్వాలంటూ కామెంట్స్ చేశారు. పైగా బీజేపీ లేకపోతే..టీడీపీ జనసేన లేనే లేవని మరింత రచ్చకు దారితీశారు. బీజేపీకి ఏపీ రాజకీయాల్లో రావాల్సినంత గుర్తింపు.. ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదని కూడా మనసులో మాటను చెప్పేశారు. అయితే ఏపీలో పదవుల విషయంలో బీజేపీకి అన్యాయం జరుగుతోందని గతంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ప్రస్తావించారు.

ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డి కూడా అంటున్నారు. బీజేపీ లేకపోతే కూటమి లేదు, ఎవరూ లేరు అన్నట్లుగా మాట్లాడటం ఒక ఎత్తు అయితే..కమ్మ అంటూ ప్రస్తావించడం..ఒక కులానికే పదవులు, పనులు దక్కుతున్నాయని ఫ్రస్ట్రేట్‌ అవడం బాలేదన్న చర్చ జరుగుతోంది. పదవులు దక్కకపోతే కులానికి లింకు పెట్టి మాట్లాడటం ఏంటన్న గుసగుసలు మొదలయ్యాయి. ఏదైనా ఆదినారాయణరెడ్డి కామెంట్స్‌ మాత్రం ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారాయి.