Andhra Pradesh : ఏపీలో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు
ఏపీలో కరోనా కేసులు వెయ్యికి పైగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 52,251 మంది నమూనాలు పరీక్షించగా 1,171 కొత్త కేసులు నమోదయ్యాయి.
- kunduru Vinod
- Updated on- September 23, 2021 / 09:37 PM IST
Ap Corona
Andhra Pradesh : ఏపీలో కరోనా కేసులు వెయ్యికి పైగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 52,251 మంది నమూనాలు పరీక్షించగా 1,171 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. గడిచిన 24గంటల్లో 1,207 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,749 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
Read More : Nellore : భూసేకరణ పరిహారం కేసు: ఐదుగురు ఐఏఎస్‌లకు ఊరట
ఇక జిల్లాల వారిగా నమోదైన కేసులను ఒకసారి పరిశీలిస్తే..
అనంతపురం – 6, చిత్తూరు – 158, తూర్పుగోదావరి – 255, గుంటూరు – 101, కడప – 48, కృష్ణా – 147, కర్నూలు – 7, నెల్లూరు – 145,ప్రకాశం – 141, శ్రీకాకుళం – 9, విశాఖపట్నం – 45, విజయనగరం – 15, పశ్చిమ గోదావరి – 94
