Nellore : భూసేకరణ పరిహారం కేసు: ఐదుగురు ఐఏఎస్‌లకు ఊరట

సెప్టెంబర్ 3న హైకోర్టు సింగిల్ బెంచ్ ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధిస్తు తీర్పు వెల్లడించిన విషయం విదితమే.. ఆ కేసుపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ స్పెండ్‌ చేసింది.

Nellore : భూసేకరణ పరిహారం కేసు: ఐదుగురు ఐఏఎస్‌లకు ఊరట

Nellore

Nellore : 2015 నాటి భూసేకరణకు సంబంధించిన కోర్టు ధిక్కార కేసులో పలువురు ఐఏఎస్‌ అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తు సెప్టెంబర్ 3తేదీన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు వెల్లడించింది. శిక్షపడిన వారిలో గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన మన్మోహన్‌సింగ్‌, ప్రస్తుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్‌ రావత్‌, అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల జైలుశిక్ష, మరో కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు, ప్రస్తుత కలెక్టర్‌ ఎన్‌వీ చక్రధర్‌లకు రూ.2వేల చొప్పున జరిమానా విధించింది.

Read More : Stock Market : సెన్సెక్స్ కొత్త రికార్డు, రూ. 3 లక్షల కోట్లు పెరిగిన బీఎస్ఈ కంపెనీల విలువ
ఇక కోర్టు ధిక్కార కేసుపై విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్‌, సింగిల్ బెంచ్ ఆదేశాలను సస్పెండ్ చేసింది. బాధితులకు ఇప్పటికే పరిహారం అందినట్లు ఐఏఎస్‌లు కోర్టుకు తెలపడంతో ఈ కేసులో తీర్పును సస్పెండ్‌ చేస్తూ డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం తీర్పు వెలువరించారు. అప్పీల్‌కు వెళ్లేందుకు వీలుగా న్యాయమూర్తి తన తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలుపుదల చేశారు.

Read More : High Court : ప్రజల్ని ఏరా,పోరా,ఏమే..అని అనటానికి వీల్లేదు : పోలీసులకు హైకోర్టు ఆదేశాలు