Stock Market : సెన్సెక్స్ కొత్త రికార్డు.. రూ.3 లక్షల కోట్లు పెరిగిన BSE కంపెనీల విలువ

స్టాక్ మార్కెట్ ల్లో ఫుల్ జోష్ కనిపించింది. సెన్సెక్స్ 800 పాయింట్లు లాభపడడంతో బీఎస్ఈ (BSE) లిస్ట్ అయిన కంపెనీల విలువ ఏకంగా రూ. 3 లక్షల కోట్లు పెరిగింది.

Stock Market : సెన్సెక్స్ కొత్త రికార్డు.. రూ.3 లక్షల కోట్లు పెరిగిన BSE కంపెనీల విలువ

Bse

Sensex Record : స్టాక్ మార్కెట్ ల్లో ఫుల్ జోష్ కనిపించింది. సెన్సెక్స్ 800 పాయింట్లు లాభపడడంతో బీఎస్ఈ (BSE) లిస్ట్ అయిన కంపెనీల విలువ ఏకంగా రూ. 3 లక్షల కోట్లు పెరిగింది. మధ్యాహ్న సమయంలో…సెన్సెక్స్ 59 వేల 729 వద్ద, నిఫ్టీ 230 పాయింట్లు పెరిగి…17 వేల 777 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..మరికొన్ని షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. స్థిరాస్తిరంగానికి చెందిన షేర్లు బాగా లాభ పడ్డాయి.

Read More : Dussehra Celebrations : ఏపీలో అక్టోబర్ 7 నుంచి దసరా ఉత్సవాలు.

ఇందుకు కారణం…కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, ఆర్థిక వ్యవస్థ మెల్లిగా పుంజుకోవడంతో ఈ పరిణామాలు స్టాక్ మార్కెట్ లపై సానుకూల ప్రభావం చూపాయని అంటున్నారు విశ్లేషకులు. ఫైనాన్షియల్ సర్వీస్ షేర్లు…రాణిస్తున్నాయి. గత నాలుగు సెషన్లలో బీఎస్ఈ రియాల్టీ…రంగ సూచి దాదాపు 20 శాతానికి పెరిగిందని, ఫలితంగా…52 వారాల అత్యధికాన్ని తాకింది.

Read More : Jubilee Hills : రెస్టారెంట్‌‌ లేడీస్‌ బాత్‌ రూమ్‌లో సీసీ కెమెరా పెట్టిన మైనర్

అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లలో మార్పు చేయరనే సంకేతాలు రావడం..మార్కెట్ లు ఫుల్ జోష్ లో ట్రేడ్ అయ్యాయి. అంతేగాకుండా..అమెరికా మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రజారోగ్య సంక్షోభం ఆర్థిక వ్యవస్థప పడవద్దని, ఇలా కాకుండా ఉండాలంటే…వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగాలని ఫెడ్ ప్రకటించింది.

Read More : AP CMRF : ఏపీ సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో ఆసక్తికర విషయాలు

మరోవైపు…చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్ గ్రాండే సంక్షోభంపై స్పందన వచ్చింది. ఇది కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ సంక్షోభాన్ని తట్టుకొనేందుకు చైనా పీపుల్స్ బ్యాంకు చర్యలు చేపట్టడం, ఈ కష్టకాలం నుంచి…సంస్థ కచ్చితంగా బయటపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు ఛైర్మన్ హుయి కా యువాన్.