ఆంధ్రప్రదేశ్ లో పది కేసులు నమోదవుతుంటే.. 9కేసులు మాత్రమే రికవరీ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల వరకూ 62వేల 123మందికి పరీక్షలు జరుపగా 10వేల 080మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. కొవిడ్ కారణంగా అనంతపూర్ లో పదకొండు, గుంటూరులో పద్నాలుగు, కర్నూల్ లో పది, పశ్చిమగోదావరిలో పది, చిత్తూరులో ఎనిమిది, నెల్లూరు ఎనిమిది, ప్రకాశంలో ఏడు, శ్రీకాకుళంలో ఏడు, తూర్పు గోదావరిలో ఆరు, వైజాగ్ లో ఐదు, విజయనగరంలో ఐదు, కృష్ణాలో నాలుగు, కడపలో రెండు మృతులు సంభవించాయి.
24గంటల్లో 9వేల 151మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి రాష్ట్రంలో 24లక్షల 24వేల 393మంది శాంపుల్స్ పరీక్షించారు.
104 హెల్ప్ లైన్, కోవిడ్ డ్యాష్ బోర్డ్ కోసం
COVID డాష్ బోర్డ్‌కై http://hmfw.ap.gov.in/covid_dashboard.aspx
COVID-19 హెల్ప్ లైన్ (టోల్ ఫ్రీ నెంబర్): 104 (24 X 7)
రాష్ట్రంలో జిల్లాల వారీగా నమోదైన మొత్తం కేసుల వివరాలు:
గడిచిన 24గంటల్లో నమోదైన కేసులు: