కోడి మాంసం తింటే కరోనా రాదు

కోడి మాంసం తింటే కరోనా (కోవిడ్‌) వైరస్‌ రాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. దీనిపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించింది. 

  • Publish Date - March 14, 2020 / 02:28 AM IST

కోడి మాంసం తింటే కరోనా (కోవిడ్‌) వైరస్‌ రాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. దీనిపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించింది. 

కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్ లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు 82 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కలకలం రేపుతోంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నాయి. వైద్య అధికారులను అప్రమత్తం చేశాయి. కోళ్ల పరిశ్రమపై కరోనా తీవ్రంగా పడింది. కోడి మాంసం తింటే కరోనా సోకుంతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోడి మాంసం తింటే కరోనా (కోవిడ్‌) వైరస్‌ రాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. దీనిపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించింది. 

కరోనా వైరస్‌ ప్రచారంతో ఆందోళన చెందిన మాంసం ప్రియులు చికెన్‌ తినడం భారీగా తగ్గించారు. దీంతో చికెన్ ధరలు పాతాళానికి పడిపోయి కోళ్ల పరిశ్రమ కకావికలమైపోతోంది. ఈ పరిశ్రమ యజమానులు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. దీంతో పశుసంవర్ధక శాఖ స్పందించింది.

కోడి మాంసం, కోడిగుడ్లు తినడం వల్ల కరోనా వైరస్‌ సోకదన్న విషయం శాస్త్రీయంగా నిరూపణ అయిందన్నారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆ శాఖ సిబ్బందికి ఆదేశాలిచ్చింది. పౌల్ట్రీ ఫెడరేషన్ల సహకారంతో అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్‌ డైరెక్టర్లు, సంబంధిత అధికారులకు సూచించింది. (హైదరాబాద్ లో మరో ఇద్దరికి కరోనా లక్షణాలు)

పుకార్ల కారణంగా కోళ్ల సంఖ్య తగ్గిపోయి భవిష్యత్తులో చికెన్, కోడిగుడ్ల ధరలు అమాంతంగా పెరిగే ప్రమాదం పొంచి ఉంది. కోళ్ల దాణాలో వాడే ముడి సరుకులు మొక్కజొన్న, సోయాల ధరలు దెబ్బతిని రైతులూ నష్టపోయే అవకాశం ఉంది. 

Also Read | ఇంటర్ పరీక్ష రాసిన బీటెక్ విద్యార్ధి.. పట్టుకున్న పోలీసులు