Tirumala Rush: ఇసుకేస్తే రాలనంత జనం.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఏకంగా ఎన్నిగంటలంటే..

క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారికి అన్నప్రసాదం అందిస్తోంది. (Tirumala Rush)

Tirumala Rush: ఇసుకేస్తే రాలనంత జనం.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఏకంగా ఎన్నిగంటలంటే..

Updated On : August 16, 2025 / 6:43 PM IST

Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు, శ్రావణ మాసం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆక్టోపస్ భవనం వరకు 4 కిలోమీటర్ల మేర క్యూలైన్లు వ్యాపించాయి. దీంతో సర్వ దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

అసలే శ్రావణ మాసం కావడం, దానికి వారాంతపు సెలవులు తోడవటం.. తిరుమలకు భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం నిండిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ లోని ఆక్టోపస్ భవనం వరకు క్యూ లైన్లు వ్యాపించాయి. దీంతో దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని టీటీడీ అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న భక్తులందరికీ దర్శనం చేయించాలంటే దాదాపు 2 రోజులు పడుతుందని అనౌన్స్ చేసింది.

తోపులాట ఘటనలు జరక్కుండా టీటీడీ జాగ్రత్తలు..
భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. తోపులాట ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రోప్ పార్టీల ద్వారా భక్తులను నియంత్రిస్తున్నారు. నెమ్మదిగా ముందుకు వదులుతున్నారు. భక్తులు క్యూలైన్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్ కి వెళ్తారు. అక్కడ వేచి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్వామి వారి దర్శనం లభిస్తుంది. స్వామి వారి దర్శనానికి 2 రోజుల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించినా.. భక్తులు ఎంతో ఓపిగ్గా క్యూలైన్ లో వేచి ఉన్నారు.(Tirumala Rush)

శ్రావణ మాసం, శనివారం, వరుస సెలవులు..
తిరుమల మొత్తం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయం, కల్యాణకట్ట ప్రాంతాల్లో భక్త జన సందోహం కనిపిస్తోంది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, శ్రావణ మాసం శనివారం కావడంతో తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. వారం రోజులుగా కొండపై భక్తుల రద్దీ ఉంది. గత మూడు రోజులుగా ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇసుకేస్తే రాలనంత జనం కొండపై ఉన్నారు.

క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారికి అన్నప్రసాదం అందిస్తోంది. అలాగే తాగునీరు కూడా అందిస్తోంది.

Also Read: జగన్ అడ్డాలో ఏమైంది.. వైసీపీకి ఎందుకీ పరాభవం? నాటి ఆ నిర్లక్ష్యమే నేటి ఈ ఓటమికి కారణమా?