Bhuma Akhila Priya: కర్నూలు మహిళా సబ్ జైల్‌కు వెళ్లి.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన కామెంట్స్
Bhuma Akhila Priya: "నా బిడ్డకు దూరంగా నేను, నా భర్త ఈ జైల్ లో గడిపాం. నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోను" అని అన్నారు.

Bhuma Akhila Priya
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ ఇవాళ కర్నూలు మహిళా సబ్ జైల్‌కు వెళ్లారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. భూమా శోభా నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మినరల్ వాటర్ ప్లాంట్, సిబ్బందికి కావాల్సిన వాటిని డొనేట్ చేశామని అన్నారు.
“గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాపై తప్పుడు కేసులు పెట్టీ ఇదే జైల్ లో పెట్టారు. నా బిడ్డకు దూరంగా నేను, నా భర్త ఈ జైల్ లో గడిపాం. నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోను.
వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ నేతలు, మిగతా వారిపై తప్పుడు కేసులు పెట్టారు. మనం పడిన కష్టాలు, నాయకులు పడిన కష్టాలు మర్చిపోకూడదు.
Also Read: ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం.. 3 రోజులు జాగ్రత్త.. చేపలవేటకు వెళ్లేవారికి హెచ్చరిక
మనల్ని నమ్ముకున్న వారికి అండగా ఉండాలి. విజయ డైయిరీలో ఎన్నో అవకతవకలు జరిగాయి.
డైయిరీలో ఏం జరుగుతుందో నేను ఆధారాలతో బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నా. లిక్కర్ స్కాంలో నిందితులను బలవంతంగా అరెస్ట్ చేయడం లేదు.
గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా ఉందని తెలపడానికి పులివెందుల ఎన్నికల ఫలితమే నిదర్శనం.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంచి మాటకారి.. ఆ యాసతో అట్రాక్ట్ అవుతారు అనుకుంటున్నారు.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లైక్స్, షేర్స్, ఫాలోవర్స్ ఉంటేచాలని అనుకుంటున్నారు. ఫీల్డ్ మీద ఉండి రాజకీయాలు చేసేది వేరు.. రీల్ మీద చేసే రాజకీయాలు వేరు. రీల్ ప్రపంచం నుంచి రియల్ ప్రపంచంలోకి సిద్ధార్థ్ రెడ్డి రావాలి. సిద్ధార్థ్ రెడ్డి రాజకీయం నేర్చుకోవాలి.
ఓడిపోయిన వాళ్లు ఎన్నో మాటలు చెబుతారు, కానీ ప్రజలు నమ్మారు కాబట్టి ఈ ఫలితం వచ్చింది. వాళ్ల పాలనకు, మా పాలనకు ఎంతో తేడా ఉంది” అని భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) అన్నారు.