AP Rains: ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం.. 3 రోజులు జాగ్రత్త.. చేపలవేటకు వెళ్లేవారికి హెచ్చరిక

తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అన్నారు.

AP Rains: ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం.. 3 రోజులు జాగ్రత్త.. చేపలవేటకు వెళ్లేవారికి హెచ్చరిక

AP Rains

Updated On : August 16, 2025 / 4:39 PM IST

AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఏపీకి అల్పపీడనాల గండం పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు చెప్పారు.

ఈ నెల 18న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే ఆవకాశం ఉందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని చెప్పారు.

అల్పపీడనానికి అనుబంధంగా ఉపతల ఆవర్తనం, రుతుపవనాల ద్రోణి కొనసాగుతోందని వివరించారు.

Also Read: పాకిస్థాన్ లో వరద విధ్వంసం మామూలుగా లేదు… 320 మంది మృతి.. అసలు ఈ వీడియో చూడండి..

దీని ప్రభావంతో రాగల మూడు రోజులు పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (AP Rains) కురిసే అవకాశం ఉందని చెప్పారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.