ఏపీలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా సోకడం కలవరాన్ని కలిగిస్తోంది.
ఏపీలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 348కి చేరాయి. కొత్తగా గుంటూరులో 8, అనంతపురంలో 7, ప్రకాశం 3, పశ్చిమగోదావరిలో ఒక్క కేసు నమోదు అయ్యింది. వైజాగ్ లో ముగ్గురు పేషెంట్స్ డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 9 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.
గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య హాఫ్ సెంచరీకి చేరువైంది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు పది కాలనీలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. గుంటూరు రేంజ్ ఐజీ, జిల్లా కలెక్టర్, అర్బన్ ఎస్పీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ గుంటూరులో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో కోవిడ్ కేసుల సంఖ్య 49కి చేరింది. మరో 135 రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అధికారులు.
చిత్తూరు జిల్లాలో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తిరుపతిలో ఆరు, నగరిలో నాలుగు, పలమనేరులో మూడు, శ్రీకాళహస్తిలో మూడు, రేణిగుంటలో రెండు, ఏర్పేడు, నిండ్రలో ఒక్కోకేసు నమోదైంది. ఆరుకేసుల్లో మర్కజ్ లింక్‌లు ఉన్నట్టు గుర్తించారు. తిరుపతిలో ఏకంగా 11వార్డులు రెడ్‌జోన్ పరిధిలోకి వెళ్లాయి.
అనంతపురం జిల్లాలో కరోనా అలజడి సృష్టిస్తోంది. పేషెంట్ల నుంచి వైద్యులకు కరోనా సోకడంతో ఒక్కసారిగా జిల్లా ఉలిక్కిపడింది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా సోకడం కలవరాన్ని కలిగిస్తోంది. (ఏపీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా…348కు చేరిన కేసులు)
తూర్పు గోదావరి జిల్లాలోనూ 11 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఏలూరులోని తంగేళ్లమూడి, తూర్పు వీధి, కత్తెపు వీధి, వైఎస్సార్ కాలనీలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. దీంతో ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయకు రావడం లేదు. కరోనాపై యుద్ధం చేసిన ఒకరు డిశ్చార్జ్ అయ్యారు.
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో 22 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు నమోదైన వారి ఇళ్ల చుట్టుపక్కల 2కిలో మీటర్ల ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని కరోనా లక్షణాలున్న వారి కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు.
నెల్లూరు జిల్లా వాసులను కరోనా వైరస్ కలవర పెడుతోంది. జిల్లాలో 48కి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడిపై అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా 38 ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించింది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఇక జిల్లాల వారిగా చూస్తే కడపలో 28, కృష్ణా జిల్లాలో 35, ప్రకాశం జిల్లాలో 27, విశాఖలో 20 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.