ఏపీ లో కొత్తగా  54 కరోనా పాజిటివ్ కేసులు 

  • Publish Date - May 28, 2020 / 06:18 AM IST

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో గత 24 గంటల్లో చేసిన కోవిడ్ 19 టెస్టుల్లో 54  మందికి పాజిటివ్ గా  తేలిందని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 9,858 మందికి  కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించామని తెలిపారు.  

రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో నలుగురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారు ఉన్నారని వీరు నెల్లూరులో 2, గుంటూరు, చిత్తూరుల్లో ఒక్కోక్కరు ఉన్నట్లు తెలిపారు.  

రాష్ట్రంలో నమోదైన మొత్తం 2841 పాజిటివ్ కేసులకు గాను  1958 మంది చికిత్స తీసుకుని డిశ్చార్జ్ కాగా 59 మంది మరణించినట్లు నివేదికలో పేర్కోన్నారు. ప్రస్తుతం 824 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Read: ఏపీలో కొత్తగా 68 కరోనా కేసులు, 58కి పెరిగిన మరణాలు