కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో నేటి నుంచి టైంస్లాట్ టోకెన్ల ద్వారానే శ్రీవారి దర్శనం జరుగనుంది. ఇందుకోసం తెల్లవారుజాము నుంచే టీటీడీ టైంస్లాట్ టోకెన్లను జారీ చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో నేటి నుంచి టైంస్లాట్ టోకెన్ల ద్వారానే శ్రీవారి దర్శనం జరుగనుంది. ఇందుకోసం తెల్లవారుజాము నుంచే టీటీడీ టైంస్లాట్ టోకెన్లను జారీ చేసింది. శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి సహా 14 చోట్ల టైంస్లాట్ టోకెన్ల జారీ సెంటర్లను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా టీటీడీ అనేక ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే భక్తులు వైకుంఠ క్యూ కంప్లెక్స్ లో కూర్చోకుండా టైమ్ స్లాట్ టోకెన్లు ఇస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ లో ఏడు కౌంటర్లు, సీఆర్ వో కాంప్లెక్స్ వద్ద ఏడు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి భక్తులు టైం స్లాట్ ద్వారానే టోకెన్లు పొందటం తద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు.
See Also | బిగ్ బ్రేకింగ్…భారత్ లో మూడో కరోనా మరణం
అయితే ఉదయం శ్రీవారి సర్వదర్శనానికి గంట సమయం ఇచ్చేవారు. ఇప్పుడు టోకెన్లు పొందిన భక్తులందరికీ కూడా సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనానికి అవకాశం ఇచ్చారు.