ఏపీలోని ఎమ్మెల్యే, 15మంది కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు

కరోనా వైరస్ మహమ్మారి గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఏకంగా ఎమ్మెల్యేని, ఆయన కుటుంబసభ్యులను అధికారులు ఐసోలేషన్ కి తరలించారు. కరోనావైరస్‌ సోకిందన్న

  • Publish Date - March 28, 2020 / 12:32 PM IST

కరోనా వైరస్ మహమ్మారి గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఏకంగా ఎమ్మెల్యేని, ఆయన కుటుంబసభ్యులను అధికారులు ఐసోలేషన్ కి తరలించారు. కరోనావైరస్‌ సోకిందన్న

కరోనా వైరస్ మహమ్మారి గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఏకంగా ఎమ్మెల్యేని, ఆయన కుటుంబసభ్యులను అధికారులు ఐసోలేషన్ కి తరలించారు. కరోనావైరస్‌ సోకిందన్న అనుమానంతో జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేను అధికారులు ఐసోలేషన్‌కి తరలించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లొచ్చిన ఎమ్మెల్యే బావమరిదికి, ఆయన భార్యకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. ఆయన ఇచ్చిన విందులో పాల్గొన్నట్లు చెబుతున్న ఎమ్మెల్యేకు కూడా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానంతో ఐసోలేషన్‌కి తరలించారు. గుంటూరు సమీపంలోని ఓ మెడికల్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌కు ఎమ్మెల్యేను, ఆయన కుటుంబానికి చెందిన 15మందిని తరలించి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఢిల్లీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే బావమరిది:
గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే బావమరిది, పొగాకు వ్యాపారి ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చాడు. ఆయన పొగాకు వ్యాపారి. మూడు రోజులు ఢిల్లీలోనే ఉన్న ఆయన.. తిరిగి రైల్లో విజయవాడ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో గుంటూరు వచ్చాడు. అప్పటికే స్వల్పంగా జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. మూడు రోజుల తర్వాత ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యుల పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గుంటూరు జిల్లాలో కరోనా తొలి పాజిటివ్ కేసుగా నమోదైన వ్యక్తి ఎమ్మెల్యే బావమరిదే. గుంటూరు సమీపంలోని కాటూరి మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్‌కి ఎమ్మెల్యేని తరలించారు. ఆయనతో పాటు 15మంది కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్‌లో ఉంచారు.

అధికార పార్టీ నేతలు, వ్యాపారులు, అధికారులకు విందు:
పొగాకు వ్యాపారి ఢిల్లీ నుంచి వస్తూ చాలా మందితో ప్రయాణించాడని.. ఆయన వచ్చిన సందర్భంగా గుంటూరులో విందు కూడా ఏర్పాటు చేశారని సమాచారం. ఆ విందుకు అధికార పార్టీ నేతలు, వ్యాపారులు, పలువురు అధికారులు కూడా హాజరయ్యారని తెలుస్తోంది. సుమారు 500 మందికి విందు ఇచ్చారని తెలుస్తోంది. మరుసటి రోజే సదరు ఎమ్మెల్యే బావమరిదికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. విందుకు హాజరైన వాళ్లలోనూ ఆందోళన మొదలైందని తెలుస్తోంది.

తెలంగాణలో పాటు ఏపీలో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీలో కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 14కి చేరింది. ఒక వ్యక్తి కోలుకున్నాడు. ఈ కేసుల్లో 11 విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ సోకినవి కాగా… 3 మాత్రం స్థానికంగా(కాంటాక్ట్ కేసులు) రాష్ట్రంలో ఉన్నవారికే వచ్చినవి. ప్రభుత్వం ఇప్పటివరకు 406 మంది అనుమానితులకు కరోనా శాంపిల్ టెస్టులు జరిపించింది. ఒక్క విశాఖలోనే 4 కేసులు ఉండగా… కృష్ణా జిల్లాలో 3, గుంటూరులో 2 కేసులున్నాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రిలో ఒక్కో కేసు నమోదైంది.

ప్రపంచవ్యాప్తంగా 6లక్షల 14వేల 73కేసులు, 28వేల 283 మంది మృతి:
కరోనా వైరస్ మహమ్మారి 199 దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా 6లక్షల 14వేల 73మంది కరోనా బారిన పడ్డారు. 28వేల 283 మంది చనిపోయారు. ఇటలీ, అమెరికా, చైనా, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ లో కరోనా విజృంభిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా మరణాలు ఇటలీలో సంభవించాయి. ఇటలీలో 86వేల 498 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాదా, 9వేల 134మంది మరణించారు. స్పెయిన్ లో 72వేల 248 పాజిటివ్ కేసులు నమోదు కాదా, 5వేల 960 మంది మృతి చెందారు. అమెరికాలో లక్ష 4వేల 256 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,704 మంది బలయ్యారు. చైనాలో 81వేల 394 కరోనా కేసులు నమోదవగా, 3వేల 295 మంది మృతి చెందారు. జర్మనీలో 53వేల 340 కేసులు నమోదవగా, 399 మంది చనిపోయారు. ఇరాన్ లో 35వేల 408 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 2వేల 517 మంది మృతి చెందారు. ఫ్రాన్స్ లో 32వేల 964 కేసులు నమోదవగా, 1,995 మంది చనిపోయారు.