COVID In Andhra Pradesh : 24 గంటల్లో 282 కేసులు, ఒకరు మృతి
- madhu
- Updated on- December 27, 2020 / 06:34 PM IST
COVID In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు (Corona Cases) నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 27 తేదీ ఆదివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 46 వేల 386 శాంపిల్స్ పరీక్షించినట్లు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 422 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, ఆదివారం వరకు రాష్ట్రంలో 1,16,20,503 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది.
మొత్తంగా ఏపీ రాష్ట్రంలో 8 లక్షల 81 వేల 061కి కరోనా కేసులు చేరుకున్నాయి. 7 వేల 094 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 3 వేల 625 యాక్టివ్ కేసులు ఉండగా..8 లక్షల 70 వేల 342 మంది డిశ్చార్జ్ అయ్యారు.
జిల్లాల వారీగా :
అనంతపురం : 31. చిత్తూరు 105. ఈస్ట్ గోదావరి : 27. గుంటూరు : 34. కడప : 17. కృష్ణా : 67. కర్నూలు : 10. నెల్లూరు : 11. ప్రకాశం : 08. శ్రీకాకుళం : 08. విశాఖపట్టణం : 28. విజయనగరం : 00. వెస్ట్ గోదావరి : 03. మొత్తం 349.
