×
Ad

Tirumala Devotees Increased : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీసాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా  భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

  • Published On : October 4, 2022 / 01:37 PM IST

tirumala

Tirumala Devotees Increased : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీసాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా  భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులకు 10 గంటల సమయంలో పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

నిన్న రికార్డుస్థాయిలో 82,815 మంది భక్తులు స్వామివారిని దర్శంచుకోగా 27, 147 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.05 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు. మహతి కళాక్షేత్రం లో నిర్వహించిన చైత‌న్య బ్రద‌ర్స్ గాత్ర సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Srivari Brahmotsavam In Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుప‌తి లోని అన్నమాచార్య క‌ళామందిరంలో ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు, విద్యార్థులు క‌లిసి వాద్య సంగీత కార్యక్రమం నిర్వహించారు. రామ‌చంద్ర పుష్కరిణిలో తిరుప‌తికి చెందిన బి. కేశ‌వి బృందం నృత్య కార్యక్రమం ఆకట్టుకుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.