విధుల్లో నిర్లక్ష్యం.. ఏపీలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటుకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.
- Harishth Thanniru
- Published On : May 31, 2024 / 12:20 PM IST
AP CS Jawahar Reddy
AP Election 2024 : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల పై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఏపీ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పి. శ్రీలేఖ పై బదిలీ వేటు పడింది. కర్నూ డిప్యూటీ కలెక్టర్ ఏ.మురళి, అనంతపూర్ డిప్యూటీ కలెక్టర్ రాంభూపాల్ రెడ్డిలు కూడా ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో బదిలీ వేటు పడింది. వీరిని బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు అధికారులు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు తదుపరి ఉత్తర్వులకోసం రిపోర్ట్ చేయాలని సీఎస్ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
Also Read : ఏపీని ఏకీపారేస్తున్న ఎండలు.. వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు.. ఉదయం నుంచే ఉక్కపోత..
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటుకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. వీరు ఆయా స్ధానాల్లో ఆర్వోలుగా ఎంసీసీ పూర్తయ్యే వరకూ వ్యవహరించనున్నట్టు సమాచారం. డిప్యూటీ కలెక్టర్లుగా నియామకమైన వారిలో ఎం. వెంకట సత్యనారాయణ, సి. విశ్వనాధ్, జె. శిరీషలు ఉన్నారు.
Also Read : జూన్3 లోగా ఖాళీ చేయాలి- సాధారణ పరిపాలన శాఖ కీలక ఆదేశాలు
ఎం వెంకట సత్యనారాయణను మార్కాపూర్ ఆర్ అండ్ ఆర్ యూనిట్ కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ చేయగా.. సి విశ్వనాధ్ ను కర్నూల్ హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్ త్రీకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ చేశారు. జే .శిరీషను అనంతపురం పిఏబిఆర్ 2కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
