×
Ad

Curfew Relaxations In AP : ఏపీలో మరికొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సమయాల్లో సడలింపులు

ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు   సమయాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  • Published On : July 5, 2021 / 02:04 PM IST

Curfew Relaxations In Andhra Pradesh

Curfew Relaxations In AP : ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు   సమయాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో  ఉదయం గం.6 నుంచి రాత్రి గం.7 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు  చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాలి. పాజిటివిటీ రేటు 5 లోపు వచ్చేంతవరకు ఈ ఆంక్షలు కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మిగిలిన 11  జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఇచ్చారు. ఈ జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాలి. సినిమా ధియేటర్లు సగం కెపాసిటీతో ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఇందులో భాగంగా సీటు సీటుకు మధ్య ఖాళీ ఉండేలా, శానిటైజర్ ఉండేలా, ప్రేక్షకులు భౌతిక దూరం పాటించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రెస్టారెంట్లు, జిమ్ లు, కళ్యాణ మండపాలు, అన్ని జన సమ్మర్ధం  ఉన్న  ప్రాంతాల్లో  కోవిడ్  నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సవరించిన వేళలు ఈనెల 8వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.