Cyclone Akwan: బంగాళాఖాతంలో బలపడిన ‘అక్వాన్‌’ తుపాను.. ఉభయ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ!

బంగాళాఖాతంలో బలపడిన ‘అక్వాన్‌(Cyclone Akwan)’ అతి తీవ్ర తుపాను కారణంగా కోస్తాంధ్ర జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Cyclone aqwan intensifies in bay of bengal likely to heavy rains alert for ap

Cyclone Akwan: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం బలపడి ‘అక్వాన్‌’ తుపానుగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను, మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా, గురువారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు నుంచి తుని మధ్యలో తీరం దాటవచ్చని అంచనా వేస్తుండగా, ఆ సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉంది.

Cherlapally Railway Station: చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. లూప్‌లైన్‌ బోగీలో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం!

ఉభయ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం.. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం:

‘అక్వాన్‌(Cyclone Akwan)’ తుపాను ప్రభావం ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై తీవ్రంగా ఉండనుందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలపై అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో బుధవారం నుంచే కోస్తాంధ్రలో భారీ వర్షాలు మొదలై, గురు, శుక్రవారాల్లో పలు చోట్ల 21 సెం.మీ.లకు పైగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన:

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే విజయనగరం, విశాఖ, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.