Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ.. ప్రత్యేకతలు ఇవే..! పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
Indrakeeladri Dasara Celebrations : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి.
- Harish Thanniru
- Updated on- October 16, 2026 / 08:36 AM IST
Indrakeeladri Dasara Celebrations
Indrakeeladri Dasara Celebrations : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ (శుక్రవారం) ఆరోరోజు మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
Also Read : AP Municipal Elections 2026 : ఏపీలో స్థానిక పోరు.. నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ.. నిబంధనలు ఇవే..
ఇంద్రకీలాద్రిపై అర్ధరాత్రి 12.49 గంటలకు దుర్గమ్మ దర్శనం ప్రారంభమైంది. తొలి దర్శనం దుర్గగుడి ఈఓ, ఛైర్మన్, సీపీ, ఇతర ఉన్నతాధికారులు చేసుకున్నారు. ఇంద్రకీలాద్రిపై అన్ని రకాల వీవీఐపీ, సిఫార్సు దర్శనాలు రద్దు చేశారు. ఉచితంగానే అన్ని క్యూలైన్ల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తుల అనుమతినిస్తున్నారు.
దసరా ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజుకు విశేషమైన స్థానం ఉంది. ఈరోజే అమ్మవారు స్వయంగా సరస్వతీ రూపంలో దర్శనమిస్తారు. సరస్వతీ దేవిని విద్యాబుద్ధులు, జ్ఞానం, సంగీతం, కళలకు అధిదేవతగా పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున చిన్న పిల్లలకు ఆలయంలో ఘనంగా అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. విద్యార్థులు, మేధావులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. వీణను ధరించి, హంస వాహనంపై కొలువుదీరి ఉండే సరస్వతీ దేవి స్వచ్ఛతకు, జ్ఞాన ప్రకాశానికి చిహ్నం.
ఇదిలాఉంటే.. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.
