Andhra Pradesh : పూర్తైన జెడ్పీ వైస్ ఛైర్మన్ల ఎంపిక.. ఒక్కో జిల్లాకు ఇద్దరు
ఈ నెల 19న ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.. ఈ ఫలితాల్లో వైసీపీ సత్తా చాటింది.
- kunduru Vinod
- Published On : September 25, 2021 / 09:00 PM IST
Andhra Pradesh
Andhra Pradesh : ఈ నెల 19న ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.. ఈ ఫలితాల్లో వైసీపీ సత్తా చాటింది. ఇక జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక కూడా నేటితో పూర్తయింది. జిల్లాపరిషత్ స్థానాలన్నీ వైసీపీనే కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి వైస్ చైర్మన్ల ఎంపిక పూర్తికాగా, వారి వివరాలు ఇలా ఉన్నాయి.
Read More : Heavy Rain : నగరంలో భారీ వర్షం.. 3 గంటల పాటు బయటకు రావద్దు
సిరిపురపు జగన్మోహన్‌రావు, పాలిన శ్రావణి ( శ్రీకాకుళం), అంబటి అనిల్‌కుమార్, బాపూజీ నాయుడు(విజయనగరం), తుంపాల అప్పారావు, భీశెట్టి సత్యవతి ( విశాఖ), బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత (తూర్పు గోదావరి), పెనుమాల విజయబాబు, శ్రీలేఖ ( పశ్చిమ గోదావరి), గరికపాటి శ్రీదేవి, గుడిమల కృష్ణంరాజు (కృష్ణ), బత్తుల అనురాధ, శొంఠిరెడ్డి నర్సిరెడ్డి( గుంటూరు), యన్నాబత్తిన అరుణ, సుజ్ఞానమ్మ (ప్రకాశం), శ్రీహరి కోట లక్ష్మమ్మ, చిగురుపాటి లక్ష్మీ ప్రసన్న(నెల్లూరు ), ధనుంజయ్‌రెడ్డి, రమ్య( చిత్తూరు), కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, నాగరత్న ( అనంతపురం), దిల్షాద్ నాయక్, కురువ బొజ్జమ్మ ( కర్నూలు), జేష్టాది శారద, పిట్టు బాలయ్య (కడప).
Read More : Kerala : ఆలయంలో ఏనుగుకు కోపం వచ్చింది..సిబ్బందిని కిందపడేసి
