Indrakeeladri: ఇంద్రకీలాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. దసరా ఉత్సవాల టికెట్లు విడుదల.. ‘మన మిత్ర’ యాప్‌తో సులభ దర్శనం!

ఇంద్రకీలాద్రి (Indrakeeladri)దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఆన్‌లైన్ సేవా టికెట్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విడుదల చేశారు.

Dussehra online service tickets released for indrakeeladri temple through whatsapp

Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20 వరకు అత్యంత వైభవంగా జరగనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఆన్‌లైన్ సేవా టికెట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విడుదల చేశారు. భక్తుల సౌకర్యం, సులభతర దర్శనాలు, పారదర్శకత లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం (Indrakeeladri)ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. భక్తులు 9552300009 అనే వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా ఇంటి నుంచే నేరుగా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.

Raghunandan Rao: హైకోర్టు సీజేకు ఎంపీ రఘునందన్ సంచలన లేఖ.. రేవంత్, కేటీఆర్ ఆస్తులపై విచారణకు డిమాండ్!

ప్రధాన సేవలకు ముందస్తు బుకింగ్ వెసులుబాటు:

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చన, చండీ హోమం, దేవీ ఖడ్గమాలార్చన, ప్రత్యేక శ్రీచక్ర నవావరణార్చన సేవలకు ముందస్తుగా డిజిటల్ విధానంలో టికెట్లు పొందే అవకాశం కల్పించారు. ఈ సాంకేతిక విధానం ద్వారా క్యూలైన్ల రద్దీ తగ్గి, దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తీవ్ర శ్రమ తప్పనుందని అధికారులు వెల్లడించారు.

మంత్రికి తొలి అధికారిక ఆహ్వాన పత్రిక సమర్పణ:

దసరా మహోత్సవాల తొలి అధికారిక ఆహ్వాన పత్రికను ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రికి అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందించారు. దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా సకల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.