Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు క్లాస్ పీకిన వైఎస్ జగన్.. ఏమైందంటే?
కొంచెం పద్ధతి మార్చుకోవాలని దువ్వాడకు జగన్ చెప్పారు.
- T Venkateshwarlu
- Updated on- February 11, 2026 / 02:53 PM IST
Duvvada Srinivas, Jagan
- అసెంబ్లీ వద్ద జగన్‌ను కలిసిన దువ్వాడ
- జగన్ కాళ్లను మొక్కిన ఎమ్మెల్సీ
- పద్ధతి మార్చుకోవాలని చెప్పిన జగన్
Duvvada Srinivas: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. జగన్ కాళ్లను మొక్కారు దువ్వాడ. గతంలో దువ్వాడ శ్రీనివాస్‌ను జగన్ వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత మొదటి సారి అసెంబ్లీ ప్రాంగణంలో జగన్‌ను దువ్వాడ శ్రీనివాస్ కలవడం ఇదే తొలిసారి. దువ్వాడకు జగన్ క్లాస్ పీకారు. కొంచెం పద్ధతి మార్చుకోవాలని దువ్వాడకు చెప్పారు.
Also Read: Kandula Durgesh : ఏపీలో నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు.. ఎవరు పంపించారంటే?
అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బాయ్ కాట్ చేసి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి.
ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఏపీ సర్కారు వాటిని పట్టించుకోకుండా గొప్పలు చెప్పుకుంటోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
