×
Ad

బ్యాక్‌ టు వైసీపీ.. దువ్వాడకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చేసినట్లేనా?

టెక్కలిలో ధర్మాన బ్రదర్స్‌ ఇన్వాల్‌మెంట్‌ లేకుండా..రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇస్తానని హామీ ఇస్తే తిరిగి వైసీపీలో యాక్టీవ్‌ కావాలన్నది దువ్వాడ ఆలోచనగా తెలుస్తోంది.

Duvvada Srinivas, YS Jagan Mohan Reddy

  • పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక ఫస్ట్‌టైమ్‌ జగన్‌తో మీట్‌
  • జగన్ కాళ్లకు దండంపెట్టిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్..
  • ధర్మానతో ఉన్న అంశాలపై మాట్లాడాలంటూ జగన్‌కు రిక్వెస్ట్

ఏపీ అసెంబ్లీ ఆవరణలో మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలవడం చర్చనీయాంశం అవుతోంది. గతేడాది ఏప్రిల్‌లో దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వైసీపీ పార్టీకి, మాజీ సీఎం జగన్‌కు దూరంగా ఉన్నారు దువ్వాడ. అసెంబ్లీ సమావేశాల స్టార్టింగ్‌ రోజు సభకు అటెండ్ అయి వాకౌట్ చేసి వస్తున్న జగన్‌ను సడెన్‌గా వెళ్లి కలిశారు దువ్వాడ శ్రీనివాస్. జగన్‌ కాళ్లకు దండం పెట్టారాయాన.

ఏం చేద్దామనుకుంటున్నావ్‌ శ్రీనివాస్‌ అంటూ జగన్ పకలరించగా..ధర్మాన సోదరులు మీకు రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారని..ధర్మానతో ఉన్న అంశాలపై మాట్లాడాలని దువ్వాడ జగన్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్‌కు జగన్ క్లాస్ పీకారని..కొంచెం పద్దతి మార్చుకో అని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే జగనే పిలిచి..ఓ సారి వచ్చి కలవమంటే కలిశానని చెప్పుకుంటున్నారట దువ్వాడ. తాడేపల్లికి వచ్చి తనను కలవాలని దువ్వాడకు జగన్‌ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొత్తం వీటి చుట్టే తిరిగింది.. ఇలాగైతే ఎలా?

మండలిలో తన వాణి వినిపిస్తానని..త్వరలోనే జగన్‌ను కలుస్తానంటున్నారు దువ్వాడ. పైగా తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతానని..మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో చేపట్టాల్సిన అవసరం లేదని కూడా దువ్వాడ తన పాయింట్‌ వ్యూను వ్యక్తం చేస్తున్నారట. ధర్మాన, కింజరాపు సోదరులు సీట్ రాకుండా చేస్తే..వైసీపీ నుంచి జగన్ అవకాశం ఇవ్వకపోతే సొంతగా పోటీ చేసి తన బలం ఏంటో చూపించాలనే ఆలోచనలో దువ్వాడ ఉన్నట్లుగా ఇన్‌సైడ్‌ టాక్‌.

వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా, అధినేత జగన్ అంటే తనకు ఎంతో అభిమానమని ఎమ్మెల్సీ దువ్వాడ ఎప్పుడూ చెబుతుంటారు. అయితే పార్టీ నుంచి బయటకు పంపిన తర్వాత జగన్‌ను కలిసేందుకు ఆయనకు ఇంతవరకు అవకాశం దక్కలేదని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ ఆ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌పై చేస్తున్న విమర్శలు వైసీపీని తీవ్ర ఇబ్బందికరంగా మారాయట.

పార్టీ సీనియర్లపై బహిరంగంగా దువ్వాడ విమర్శలు
పార్టీ సీనియర్లపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న దువ్వాడ వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చే నడుస్తోందట. వైసీపీ నేతలైన ధర్మాన సోదరులను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం ఉంది. ఈ క్రమంలో పార్టీ అధినేత జగన్ ఆశీస్సుల కోసం ఎప్పటికప్పుడు ఆయనపై భక్తి ఉన్నట్లు చెప్పుకుంటున్నారట. అయితే దువ్వాడ విషయంలో జగన్‌ సాఫ్ట్ కార్నర్‌తో ఉన్నట్లుగా ఓ చర్చ నడుస్తోంది.

దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూ ఆయన వ్యక్తిగతమని..శ్రీకాకుళం జిల్లా నేతలతో ఉన్న పేచీని సెట్‌ చేసుకుంటే ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయొచ్చన్న అంచనాలున్నాయి. అయితే ధర్మానతో ఉన్న విభేదాలను జగన్‍ దృష్టికి తీసుకెళ్లి..తన నిర్ణయమేంటో ప్రకటించాలన్న ఆలోచనలో దువ్వాడ ఉన్నారట. అయితే 2029 ఎన్నికల్లో టెక్కలి నుంచి తాను పోటీ చేస్తానని, ఒకవేళ వైసీపీ టికెట్ ఇవ్వకున్నా ఇండిపెండెంట్‍గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తానని ఆయన చెప్పినట్లు వార్తలు రావడం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే ధర్మాన బ్రదర్స్‌ను టార్గెట్‌ చేస్తూ..తన కళింగ సామాజికవర్గంలో పట్టు పెంచుకునేందుకు దువ్వాడ పెద్ద స్కెచ్చే వేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన సిక్కోలు పాలిటిక్స్‌లో ఒంటరి అయిపోయారని అంటున్నారు. ఓవైపు ఫ్యామిలీలో చిచ్చు..ప్రేయసితో కలిసి వేరు కాపురం ఇవన్నీ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపించాయని..వాటిని ఓవర్ కమ్ చేసేందుకే దువ్వాడ కళింగలకు అన్యాయమంటూ గళమెత్తడం స్టార్ట్ చేశారని అంటున్నారు.

ఓవరాల్‌గా దువ్వాడ ఎపిసోడ్‌ శ్రీకాకుళంలో జిల్లాలో వైసీపీకి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. సేమ్‌టైమ్‌ టెక్కలి వైసీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్‌ కూడా కళింగ సామాజికవర్గం నేత అయినా..ఆయనతో దువ్వాడకు గిట్టట్లేదట. ధర్మాన బ్రదర్స్ చెప్పుచేతల్లో పేరాడ తిలక్ పనిచేస్తూ..తన వ్యతిరేకతంగా పావులు కదుపుతున్నారని..గతంలో తనకు పార్టీ టికెట్ ఇస్తే ఆయన సహకరించలేదని అసంతృప్తితో ఉన్నారట దువ్వాడ.

దాంతో టెక్కలిలో ధర్మాన బ్రదర్స్‌ ఇన్వాల్‌మెంట్‌ లేకుండా..రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇస్తానని హామీ ఇస్తే తిరిగి వైసీపీలో యాక్టీవ్‌ కావాలన్నది దువ్వాడ ఆలోచనగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దువ్వాడ విజ్ఞప్తిపై జగన్‌ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి.