మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొత్తం వీటి చుట్టే తిరిగింది.. ఇలాగైతే ఎలా?
సీఎం రేవంత్ కూడా ప్రచారంలో అభివృద్ధి ఎజెండాను గాలికి వదిలేసి.. బీజేపీ, బీఆర్ఎస్ను బ్లేమ్ చేసేందుకే ఎక్కువ టైమ్ కేటాయించారన్న టాక్ వినిపిస్తోంది.
KCR, Revanth Reddy, Kishan Reddy
- కులం, మతం చుట్టూ లీడర్ల రచ్చ
- ఫోన్ ట్యాపింగ్ చుట్టే ప్రచారాన్ని తిప్పిన సీఎం
- కేసీఆర్ సెంట్రిక్‌గా కాంగ్రెస్, బీజేపీ విమర్శలు
Telangana municipal elections: తెలంగాణ మున్పిపల్ ఎన్నికల్లో కుల, మతం సెంట్రిక్‌గానే లీడర్ల ప్రసంగాలు నడిచాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల డెవలప్మెంట్ కంటే ఫోన్ ట్యాపింగ్ చుట్టే రాజకీయమంతా నడిపించారు సీఎం రేవంత్. అధికార కాంగ్రెస్ మొదలు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను బేస్ చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో బీఆర్ఎస్, బీజేపీపై అటాక్ చేస్తే..బీజేపీ కాంగ్రెస్, బీఆర్ఎస్ను కలిపి టార్గెట్ చేసింది. కేసీఆర్ కుటుంబానికి కిషన్ రెడ్డి రక్షణ కవచంలా ఉన్నారన్న రేవంత్ రెడ్డి..కిషన్ రెడ్డిని కల్వకుంట్ల కిషన్ రావు అని పిలుస్తామంటూ కామెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని కల్వకుంట్ల కిషన్ రావు అని సంబోధించడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.
రేవంత్ రెడ్డి..బీఆర్ఎస్ బీజేపీకి లింకు పెట్టి..కిషన్ రెడ్డి ఇంటి పేరు, కులం పేరును మారిస్తే..కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మత రాజకీయానికి తెరలేపారు. మజ్లీస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ముడిపెడుతూ ఆరోపణలు, విమర్శలు చేశారు. తాను ఎవ్వరికీ దత్తపుత్రుడ్ని కాదన్న కిషన్ రెడ్డి..మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మధ్య ఏవైనా విభేదాలుంటే వారే తేల్చుకోవాలని, మధ్యలో తనను లాగడం ఎందుకని ప్రశ్నించారు.
Also Read: Jagga Reddy: జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్.. పోలీసులకు కీలక ఆదేశాలు
మజ్లిస్‌తో కాపురం చేస్తున్న రేవంత్ రెడ్డి తన పేరును రేవంత్ ఖాన్‌గా మార్చుకోవాలని సూచించారు కిషన్ రెడ్డి. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరును రేవంత్ నాయుడుగా పిలుస్తూ చర్చకు దారితీశారు. రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం టీడీపీలో కొనసాగారు. చంద్రబాబు నాయుడుకు ఆయన అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు కూడా.
రేవంత్ రెడ్డిని కాస్త రేవంత్ నాయుడిగా పిలిచి..
రేవంత్ రెడ్డి ఇప్పటికీ చంద్రబాబు కనుసన్నల్లోనే పని చేస్తున్నారని, ఆయన తెలంగాణ కంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డిని కాస్త రేవంత్ నాయుడిగా పిలిచారు హరీశ్‌రావు. ఇలా మూడు ప్రధాన పార్టీల కీలక నేతలు..ఇంటి పేర్లు..పేర్ల చివరిలో తోకలు మార్చి..ఒకరిపై ఒకరు అటాక్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు ప్రతిపక్షాలు. పైగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కూడా ఆరోపిస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో మున్సిపల్ ఎన్నికలను అస్త్రంగా చేసుకుని అధికార పార్టీపై అటాక్ చేయాల్సింది పోయి..రేవంత్ ట్రాప్‌లో పడి కులం, మతం చుట్టూ డైలాగ్‌వార్‌కు దిగడం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి.
సీఎం రేవంత్ కూడా ప్రచారంలో అభివృద్ధి ఎజెండాను గాలికి వదిలేసి.. బీజేపీ, బీఆర్ఎస్ను బ్లేమ్ చేసేందుకే ఎక్కువ టైమ్ కేటాయించారన్న టాక్ వినిపిస్తోంది. ఏదైనా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నేతలు సరికొత్త పాలిటిక్స్‌కు తెరలేపారన్న చర్చ అయితే జరుగుతోంది. ఇప్పుడే ఇలా ఒకరి పేర్లు మరొకరు మార్చుకుని..వాళ్లు వీళ్లకు బీ టీమ్..వీళ్లు వాళ్లకు బీ టీమ్‌ను అని క్యాంపెయిన్ చేసిన లీడర్లు..గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి అటాకింగ్‌కు దిగుతారోనన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.
