Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. ఆందోళనలో అనుచరులు.. మాధురి రియాక్షన్..!
Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఆయన్ను పోలీసులే అరెస్ట్ చేశారంటూ మాధురి ఆరోపిస్తుండగా.. పోలీసులు మాత్రం తమకు సంబంధం లేదని చెబుతున్నారు..
- Sreehari A
- Published on- June 30, 2026 / 04:24 PM IST
Duvvada Srinivas
Duvvada Srinivas : ఏపీ రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ కేసుకు సంబంధించి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దువ్వాడపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు.
అయితే, రెండు గంటలు గడుస్తున్నా దువ్వాడ పోలీసు స్టేషన్ (Duvvada Srinivas) వద్దకు చేరుకోలేదు. దువ్వాడ మిస్సింగ్ ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన మాధురి కూడా దువ్వాడను పోలీసులే అరెస్టు చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు.
ఆయనకు ఏమైంది? ఎప్పుడు ఏం జరుగుతుందో అని అనుచరులు ఆందోళన చెందుతున్నారు. కానీ, దువ్వాడ కనిపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దువ్వాడ ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడం మరింత అనుమానాలు పెరిగాయని ఆమె అన్నారు.
Read Also : Kodali Nani : ఏపీ హైకోర్టులో కొడాలి నానికి భారీ ఊరట..!
అయితే ఈ ఆరోపణలను కొత్తూరు పోలీసులు తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్ వద్దకు దువ్వాడ రాలేదని, మాకేమి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. దువ్వాడతో పాటు ఆయన పర్సనల్ పీఏ కూడా లేడని మార్గమధ్యలో దిగిపోయాడని అంటున్నారు. దాంతో దువ్వాడ ఎక్కడ ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.
మాధురి రియాక్షన్ :
ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి దువ్వాడ శ్రీనివాస్ బయలుదేరినట్టు మాధురి చెప్పారు. తమను ఎవరని దువ్వాడ వెంట రావోద్దన్నారని, మధ్యాహ్నం 12:30 నుంచి దువ్వాడ కాంటాక్ట్ లేరని తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్, ఆయన వెహికల్ డ్రైవర్ ఎవరూ ఫోన్ అందుబాటులో లేరని అన్నారు. ఈ విషయంలో పోలీసుల నుంచి కనీసం సమాచారం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను నా సొంత పనులు కోసం కూడా ఇంటినుంచి బైటకు వెళ్లడం లేదన్నారు.
కాగా, దువ్వాడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లే ముందు మాట్లాడిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో దువ్వాడ చేసిన వ్యాఖ్యలు, అనంతరం ఆయన అదృశ్యం కావడం చర్చలకు దారితీస్తోంది.
