Dwcra Loans: డ్వాక్రా మహిళలకు అదిరిపోయే వార్త.. స్త్రీనిధిలో రూ.3 లక్షల ఆర్థిక సహాయం.. సర్కార్ కీలక నిర్ణయం
డ్వాక్రా మహిళలను(Dwcra Loans) విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
- V Santhosh Kumar
- Updated on- August 14, 2026 / 02:25 PM IST
dwcra women 3 lakhs stree nidhi loan pmfme scheme
- డ్వాక్రా మహిళలకు ఆర్థిక ఊతం
- మూడు లక్షల స్త్రీనిధి రుణం
- సొంత బిజినెస్‌కి ప్రభుత్వ తోడ్పాటు
Dwcra Loans: డ్వాక్రా మహిళలను కేవలం సంఘాల నిర్వహణకే పరిమితం చేయకుండా, వారిని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలను విస్తరించి, గ్రామీణ మహిళల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే మహిళా సాధికారతను తదుపరి స్థాయికి తీసుకెళ్లేలా పీఎంఎఫ్‌ఎంఈ పథకాన్ని స్త్రీనిధి కో-ఆపరేటివ్ ఫెడరేషన్‌తో అనుసంధానిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
ఆహార శుద్ధి యూనిట్లకు రూ. 3 లక్షల స్త్రీనిధి రుణం:
ఈ నూతన విధానం ద్వారా అర్హులైన డ్వాక్రా(Dwcra Loans) మహిళలు రూ. 3 లక్షల వరకు యూనిట్ వ్యయంతో తమ సొంత ఆహార శుద్ధి పరిశ్రమలను స్థాపించుకోవచ్చు. దీనికి అవసరమైన ఆర్థిక సాయాన్ని స్త్రీనిధి ద్వారా రుణం రూపంలో అందిస్తారు. మహిళలు స్థానికంగా లభించే పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌తో పాటు చిరుధాన్యాలు, పప్పులు, మసాలా దినుసులు, పచ్చళ్లు, పిండి పదార్థాలు, పలు రకాల స్నాక్స్ తయారీ యూనిట్లను నెలకొల్పి సొంతంగా వ్యాపారాలను ప్రారంభించేందుకు ఈ పథకం చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది.
జిల్లాల సమాఖ్యల ద్వారా ఎంపిక, సమగ్ర తోడ్పాటు:
ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రతి జిల్లాలోని ‘జిల్లా సమాఖ్య’లను డిస్ట్రిక్ట్ రిసోర్స్ ఆర్గనైజేషన్లుగా వ్యవహరిస్తారు. వీరి పర్యవేక్షణలో వ్యాపార ఆసక్తి, సరైన సామర్థ్యం ఉన్న డ్వాక్రా మహిళలను గుర్తించి దరఖాస్తులను పరిశీలిస్తారు. ప్రభుత్వం కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా, మహిళలు ప్రారంభించిన వ్యాపారాలు మార్కెట్లో నిలదొక్కుకుని లాభాల బాట పట్టే వరకు అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్ మద్దతును సమగ్రంగా అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
