Cow Urine: గవర్నమెంట్ ‘గోమూత్రం ప్రాజెక్టు’.. లీటర్ రూ.10 చొప్పున కొని.. నెలకు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్నారు
Cow Urine Project: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శ్యానా తహసీల్ పరిధిలోని నార్సేనా ప్రాంతంలో 'గోమూత్ర సేకరణ' పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
UP government launches cow urine procurement pilot project for farmers
- లీటరు ఆవు మూత్రం పది
- రైతులకు అదనపు ఆదాయ మార్గం
- ప్రకృతి సేద్యానికి బిగ్ ఊతం
Cow Urine Project: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులు, పశువుల పెంపకందారులను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బుులంద్షహర్ జిల్లాలోని శ్యానా తహసీల్ పరిధిలోని నార్సేనా ప్రాంతంలో ‘గోమూత్ర సేకరణ(Cow Urine)’ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఒక రైతు ఉత్పత్తిదారుల సంస్థ నేతృత్వంలో దాదాపు 15 గ్రామాల్లో ఈ సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. లీటరు ఆవు మూత్రానికి రూ.10 చొప్పున చెల్లిస్తూ, రైతుల వద్ద నుండి ప్రతిరోజూ దాదాపు 500 లీటర్ల గోమూత్రాన్ని సేకరిస్తున్నారు.
Read Also – Alcohol Ban: అక్కడ పెళ్లికానివారు తాగితే రూ.5 వేలు ఫైన్.. చెప్తే రూ.2 వేలు గిఫ్ట్.. ఆ ఊళ్ళో వింత రూల్స్
గ్రామీణ మహిళలకు ఉపాధి, సేకరణ కేంద్రాల ఏర్పాటు:
రైతులు గోమూత్రాన్ని సులభంగా విక్రయించడానికి వీలుగా గ్రామాల్లో 200 లీటర్ల సామర్థ్యం ఉన్న ప్రత్యేక ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఈ సేకరణ ప్రక్రియలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తూ, లీటరుకు రూ.2 చొప్పున కమిషన్ చెల్లిస్తున్నారు. దీనివల్ల పశువుల యజమానులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా, సేకరణ బాధ్యతలు చూసుకునే మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతోంది.
నైసర్గిక వ్యవసాయానికి ఊతం, ఆర్గానిక్ ఎరువుల తయారీ:
సేకరించిన ఆవు మూత్రాన్ని రసాయన రహిత సేంద్రీయ ఎరువులు, ప్రకృతి పురుగుమందుల తయారీకి ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు. రసాయనాల వాడకాన్ని తగ్గించి ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌గా నడుస్తున్న ఈ విధానం విజయవంతమైతే, త్వరలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
